Bimbisara : 2015 లో విడుదలైన పటాస్ చిత్రంతో కల్యాణ్ రామ్ హిట్‌ను అందుకోగా.. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు అన్నీ ఫ్లాప్ గా నిలిచాయి. బింబిసార చిత్రంతో సక్సెస్ ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్. బింబిసార చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి సక్సెస్ దిశగా దూసుకుపోయింది. ఈ చిత్ర విజయంతో కళ్యాణ్ రామ్ తిరిగి సక్సెస్ ఫేమ్ లోకి వచ్చేశాడు. ఎటువంటి హడావుడి లేకుండా విడుదలైన బింబిసార చిత్రం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల బాటలో పయనించింది.
ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ ద్వారా యువ దర్శకుడు వశిష్టను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ నిర్మించారు. ఒక పవర్ ఫుల్ కథాంశాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడంలో వశిష్ట సక్సెస్ ను సాధించారని చెప్పవచ్చు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటన పరంగా అందరి దృష్టినీ ఆకర్షించారు.
ప్రముఖ టాలీవుడ్ హీరోలు సైతం కళ్యాణ్ రామ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. అయితే వశిష్ట ఈ చిత్ర కథను కళ్యాణ్ రామ్ కంటే ముందు నలుగురు హీరోలకు చెప్పాడట. బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన ఆ నలుగురు హీరోలు ఎవరంటే..
మొదటగా వశిష్ట ఈ చిత్ర కథను నితిన్ తో చర్చలు జరపగా నితిన్ ఈ కథను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనిని సంప్రదించగా ఇలాంటి కథ తనకు సెట్ కాదని నో చెప్పేశాడట. ఆ తరవాత అల్లు శిరీష్, రాజ్ తరుణ్ వంటి వారితో కూడా కథ గురించి చర్చలు జరపగా వారు కూడా బింబిసారలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట. చివరికి ఈ చిత్రం కళ్యాణ్ రామ్ ని వరించింది.
ఒకవేళ ఈ నలుగురిలో ఏ ఒక్కరు బింబిసార చిత్రంలో హీరోగా నటించినా కచ్చితంగా సక్సెస్ అయ్యి ఉండేదికాదు. కళ్యాణ్ రామ్ మాత్రమే బింబిసార చిత్రానికి అత్యద్భుతంగా సెట్ అయ్యాడు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటన అదరహో అనిపించే విధంగా ఉంది.