Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home politics

కాళ్ల బేరానికి వ‌చ్చిన శ్రీ‌రెడ్డి.. ముందే ఆలోచించి ఉండాల్సింది..!

Admin by Admin
November 14, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పెద్ద‌లు అందుకే అంటుంటారు. కాలు జారితే తీసుకోవ‌చ్చు కానీ మాట జారితే తీసుకోలేము అని. ఈ సామెంత అంద‌రికీ వ‌ర్తిస్తుంది. అవును, ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను సునిశితంగా గ‌మ‌నిస్తే ఈ విష‌యం ప్ర‌స్ఫుట‌మ‌వుతుంది. టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది కనుక ఆ నేత‌లు ఊరుకోరు. వైసీపీ హ‌యాంలో తాము అనుభ‌వించిన క్షోభ‌కు రెట్టింపు బాధ అనుభ‌వించేలా వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఇబ్బందులు పెట్ట‌డం ఖాయం. గ‌తంలో వైసీపీ చేసింది కూడా అదే. ప్ర‌భుత్వంలోని పార్టీలు మారిన‌ప్పుడ‌ల్లా జ‌రిగే తంతు ఇదే. అయితే ఎటొచ్చీ అంద‌రూ బాగానే ఉంటారు, కానీ ఏమీ ఆలోచించ‌కుండా అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీలు, నేత‌ల‌పై అవాకులు, చెవాకులు మాట్లాడితే మొద‌టికే మోసం వ‌స్తుంది. అవును, స‌రిగ్గా సినీ న‌టి శ్రీ‌రెడ్డి అనుభ‌విస్తున్న‌ది ఇదే.

వైసీపీ అధికారంలోకి రాలేదు క‌నుక టీడీపీ కూట‌మి నేత‌లు త‌న ప‌ని ప‌డ‌తారు అనుకుందో, మ‌రో విష‌య‌మో తెలియ‌దు కానీ శ్రీ‌రెడ్డి మాత్రం కాళ్ల బేరానికి వ‌చ్చేసింది. మంత్రి నారా లోకేష్‌తోపాటు సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌, హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, ప‌లు టీడీపీ మీడియా చాన‌ల్స్‌, ప‌త్రిక‌లు, టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీల‌కు ఆమె బేష‌ర‌తుగా బ‌హిరంగ లేఖ ద్వారా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. తాను ఏం మాట్లాడుతున్నానో తెలియ‌కుండా, ముందు వెనుక ఆలోచించ‌కుండా అనుచిత వ్యాఖ్య‌లు చేశాన‌ని, ఇక‌పై అలాంటి కామెంట్స్ చేయ‌న‌ని, తాను మాట్లాడిన బూతుల వ‌ల్ల ఎంతో మంది మ‌నోభావాలు దెబ్బ తిన్నాయో త‌న‌కు ఇప్పుడు అర్థం అవుతుంద‌ని శ్రీ‌రెడ్డి చెప్పుకొచ్చింది. త‌న‌ను క్ష‌మించాల‌ని లోకేష్‌ను అన్న అంటూ సంబోధిస్తూ శ్రీ‌రెడ్డి క్ష‌మాప‌ణ‌లు కోరింది.

sri reddy tells sorry to minister nara loksesh for her comments in past

అయితే శ్రీ‌రెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ప్ప‌టికీ టీడీపీ, జ‌న‌సేన నేత‌లు మాత్రం ఆమెపై ఫిర్యాదు చేస్తున్నారు. ఆమె మాట్లాడిన మాట‌ల వ‌ల్ల త‌మ మ‌నోభావాలు దెబ్బ తిన్నాయ‌ని, గ‌తంలోనే ఆమె కామెంట్స్‌పై ఫిర్యాదు చేసినా పోలీసులు ప‌ట్టించుకోలేద‌ని, క‌నుక ఇప్ప‌డైనా పోలీసులు కేసు న‌మోదు చేసి ఆమెను అరెస్టు చేయాల‌ని నేత‌లు కోరుతున్నారు. అయితే ఆమె తీరు మాత్రం కాళ్ల బేరానికి వ‌చ్చిన‌ట్లే ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రి శ్రీ‌రెడ్డిని అరెస్టు చేస్తారా, విడిచి పెడ‌తారా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది. అయితే ఏ పార్టీ కూడా శాశ్వ‌తంగా అధికారంలో ఉండ‌దు అన్న స‌త్యాన్ని గ్ర‌హించ‌లేక శ్రీ‌రెడ్డి కాస్త దుందుడుకుగా వ్య‌వ‌హ‌రించింద‌ని, అందుక‌నే ఆమె అలా మాట్లాడింద‌ని, అస‌లు ఆ అవ‌స‌ర‌మే లేద‌ని కొంద‌రు అంటున్నారు. ఇలా జ‌రిగితే ఎలా అని ముందే ఆలోచించి ఉండాల్సింద‌ని అంటున్నారు.

Tags: nara lokeshSri Reddy
Previous Post

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటున్న క‌స్తూరి..? ఊచ‌లు లెక్క‌పెట్టాల్సిందే..?

Next Post

Hanuman Chalisa : రాత్రి పూట‌ హనుమాన్ చాలీసా చదివితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Related Posts

Off Beat

రోడ్డు ప్ర‌మాదంలో భార్య‌ను కోల్పోయిన ఓ భ‌ర్త ఆవేద‌న ఇది..

May 9, 2025
ఆధ్యాత్మికం

భ‌గ‌వ‌ద్గీత ఎందుకు చ‌ద‌వాలి? మ‌న‌వ‌డికి తాత చెప్పిన స‌మాధానం.!!

May 9, 2025
vastu

ఉద‌యం 5 నుంచి 7 గంట‌ల మ‌ధ్యలో ఎడ‌మ క‌న్ను అదిరితే ఏమవుతుందో తెలుసా?

May 9, 2025
వినోదం

సూప‌ర్ స్టార్ కృష్ణ ఆర్థికంగా ఎంత న‌ష్ట‌పోయారో తెలుసా..?

May 9, 2025
politics

అతి తెలివి చూపిస్తున్న పాకిస్తాన్.. భార‌త్ ముందు ఫ‌లించేనా..?

May 9, 2025
inspiration

జీవితంపై విర‌క్తి క‌లిగిన ఓ అమ్మాయికి త‌న తండ్రి చెప్పిన మాట‌లు.. ఆలోచించాల్సిందే..

May 9, 2025

POPULAR POSTS

politics

నెట్ లో వైరల్ అవుతున్న చంద్రబాబు పెళ్లిపత్రిక చూసారా ? అప్పట్లో ఎంత కట్నం తీసుకున్నారంటే ?

by Admin
May 8, 2025

...

Read more
మొక్క‌లు

Vavilaku : శ‌రీరంలోని అన్ని ర‌కాల నొప్పులు, వాపుల‌కు ప‌నిచేసే వావిలి ఆకులు.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by D
May 16, 2022

...

Read more
కూర‌గాయ‌లు

Beerakaya : బీర‌కాయ‌ల‌ను తింటున్నారా.. అయితే ఈ విషయాల‌ను తెలుసుకోవాల్సిందే..!

by D
March 22, 2023

...

Read more
ఆధ్యాత్మికం

Pichukalu : పిచ్చుక‌లు ఇంట్లోకి ప‌దే ప‌దే వ‌స్తున్నాయా.. దాని అర్థం ఏమిటో తెలుసా..?

by D
November 7, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
food

Filter Coffee : హోట‌ల్స్ లో ల‌భించే ఫిల్ట‌ర్ కాఫీని ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

by D
May 21, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.