Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home politics

Roja : భ‌ర్త వ‌ల్ల కోట్లు న‌ష్ట‌పోయిన రోజా.. త‌రువాత ఆమె ఎలా బ‌య‌ట ప‌డిందంటే..?

Admin by Admin
November 16, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Roja : 1990 దశాబ్దంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లో మంచి క్రేజ్ ఉన్న తారలలో రోజా కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి రోజా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాకుండా అప్పటి స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ వంటి వారితో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు త‌మిళంలో కూడా రోజాకి మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో కూడా రోజా ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సమ్మక్క సారక్క వంటి సినిమాల్లో కూడా రోజా అదరగొట్టింది.

రోజా ఏపీలోని చిత్తూరు జిల్లాలో జన్మించారు. తిరుపతి పద్మావతి మహిళా యునివర్సిటీలోనే చదువుకున్నారు. అంతే కాకుండా నాగార్జున యునివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో పీజీ పూర్తి చేశారు. చదువుకునే టైంలోనే నటన పై ఉన్న మక్కువతో రోజా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటన పరంగా ఎన్నో అవార్డులను దక్కించుకుంది రోజా. దివంగ‌త మాజీ ఎంపీ శివ‌ప్ర‌సాద్.. రోజాకు సినిమాల్లో ఆమెకు గురువు. రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. ఆమె పేరును రోజాగా మార్చింది కూడా శివ‌ప్ర‌సాదే.

how roja finally get away from economical problems

2002 లో రోజా తమిళ దర్శకుడు ఆర్ కే సెల్వామణిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. సెల్వమణి వివాహం చేసుకున్న తరవాత రోజాకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో రోజా సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ స్థాపించారు. తన ప్రొడక్షన్ లోనే భర్త దర్శకుడిగా అనేక చిత్రాలను నిర్మించారు. ఈ సినిమాలు తీయటం కోసం రోజా తాను ఆరు సినిమాలకు తీసుకున్న రెమ్యునరేషన్ మొత్తాన్ని ఖర్చు చేశారట.

అయితే సొంతంగా తీసిన మూడు సినిమాలకు మంచి టాక్ వచ్చినా ఆశించిన మేరకు మంచి ఫలితాలు అందుకోలేకపోయాయి. దాంతో ఆ సినిమాలకు నష్టాలను చవి చుడాల్సి వచ్చింది. అలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే రోజా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2004, 2009 సంవత్సరాల్లో నగరి, చంద్రగిరి నియజకవర్గాల నుండి పోటీ చేసి ఓడిపోయారు రోజా. ఈ క్రమంలో రోజా ఆర్థికంగా మరింత నష్టపోయారు.

ఇక 2013 లో జబర్ద‌స్త్ కామెడీ షో ప్రారంభం కాగా ఆ షో లో జడ్జి గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ షో ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందడంతో ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న రోజాకి మల్లెమాల సంస్థ ద్వారా అత్యధికంగా పారితోషికం అందింది. రోజా ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో జబర్దస్త్ షో కీల‌క పాత్ర పోషించింద‌ని చెప్పవచ్చు.

Tags: roja
Previous Post

Honey And Fruits : షుగ‌ర్ ఉన్న‌వాళ్లు తేనె తీసుకోవ‌చ్చా.. పండ్లు తిన‌వ‌చ్చా.. తీసుకుంటే ఏం జ‌రుగుతుంది..?

Next Post

Cinnamon And Lemon : రోజూ రెండు సార్లు ఈ డ్రింక్‌ను తాగండి చాలు.. ఎంత‌టి పొట్ట అయినా స‌రే క‌రిగిపోతుంది..!

Related Posts

పోష‌ణ‌

యుక్త వ‌య‌స్సులో ఉన్న బాలిక‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి..!

July 12, 2025
వైద్య విజ్ఞానం

బైపాస్ సర్జ‌రీ అంటే ఏమిటి..? ఏం చేస్తారు.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

July 12, 2025
హెల్త్ టిప్స్

రోజూ ట‌మాటాల‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. ఎందుకంటే..?

July 12, 2025
lifestyle

అమెరికాలో ఉన్నటువంటి ఆఫ్రికన్ ప్రజలు ఆస్ట్రేలియాలో ఎందుకు లేరు?

July 12, 2025
lifestyle

హిట్ 3 లో చూపించిన‌ట్లు స‌మాజం అంత‌గా రాక్ష‌సానందం పొందుతుందా..?

July 12, 2025
mythology

శ్రీ‌కృష్ణదేవ‌రాయ‌లు స‌రిగ్గా అదే తేదీన చ‌నిపోయార‌ట‌..!

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.