Lord Shiva : శివుడి అనుగ్రహం కోసం, ప్రతి ఒక్కరు కూడా శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా, కార్తీకమాసంలో శివుడికి ప్రత్యేకించి పూజలు చేస్తూ ఉంటారు. అలానే, శివుడికి ప్రత్యేకించి అభిషేకాలను కూడా జరుపుతారు. ప్రతి సోమవారం కూడా, ఇంట్లో ఉన్న శివలింగానికి నీటితో అభిషేకం చేస్తే చాలా మంచిది. అభిషేకం చేసే సమయంలో, శ్రీ రుద్రాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. 21 రోజుల పాటు, ఇలా శివుడికి అభిషేకం చేయడం వలన, మన కోరికలు నెరవేరుతాయి. శివుడు చిత్రపటంలో శివుని యొక్క కంఠాన్ని చూస్తూ, శ్రీ నీలకంఠాయ నమః అని జపిస్తూ పూజ చేయండి.
21 సోమవారాలు ఇలా చేయాలి. అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు, ఈ పద్ధతిని పాటించినట్లయితే, ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. శివలింగానికి ప్రతి సోమవారం పాలాభిషేకం చేస్తూ, శ్రీ మహాదేవాయ నమః అని జపించాలి. ఆ తర్వాత మూడు బిల్వదళాలని సమర్పించాలి. ఇలా చేయడం వలన సంపద పెరుగుతుంది. కోరికలు నెరవేరుతాయి.
శివుడుని పార్వతీ సమేతంగా మనసులో ధ్యానిస్తూ, లేదంటే చిత్ర పటాన్ని చూస్తూ శ్రీ గౌరీ ప్రియాయ నమః అని జపించాలి. ఇలా చేయడం వలన కోరికలు నెరవేరుతాయి. జీవితంలో అభివృద్ధి కూడా ఉంటుంది. సోమవారం పూట, శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేసి, శ్రీ మృత్యుంజయై నమః అని జపించాలి.
21 సోమవారాలు ఈ విధంగా పాటించాలి. ఇలా చేస్తే, భయంకరమైన రోగాలు కూడా తొలగిపోతాయి. శివుడికి దీపం వెలిగించి, ఆ దీపం లో వెలుగుతున్న తేజస్సుని శివుడి రూపంగా భావించి, శ్రీ పరమేశ్వరాయ నమః అని 1008 సార్లు జపించి, 41 రోజులపాటు దీక్ష చేయాలి. అప్పుడు అసాధ్యం అనుకున్న పనులు కూడా పూర్తయిపోతాయి.