Devotional : సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారికి వస్త్రాలను సమర్పించడం చేస్తుంటాం. ఈ విధంగా అమ్మవారి చెంత చీరలు పెట్టి ఆ చీరలను అమ్మవారి ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. అయితే మహిళలు ఆ చీరలను ఎప్పుడు కట్టుకోవాలి ? ఆ చీరలు కట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? అనే విషయాల గురించి చాలా మందికి తెలియదు.
నిజానికి అమ్మవారికి సమర్పించిన పత్రాలను సాక్షాత్తూ అమ్మవారి స్వరూపంగా భావిస్తారు కనుక మహిళలు ఆ చీరలను ఎప్పుడు పడితే అప్పుడు ధరించకూడదు. కేవలం పూజ సమయంలోనూ, వ్రతాలు, నోములు చేసే సమయంలో కట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అంతేకానీ అమ్మవారికి సమర్పించిన చీరలను ఏదైనా ఊర్లకి వెళ్లే సమయంలోనూ.. అదేవిధంగా శుభకార్యాలకు వెళ్లే సమయంలోనూ ధరించకూడదు.
కేవలం చీరలు మాత్రమే కాకుండా మనం ఏదైనా పూజా కార్యక్రమాలకు వెళ్లిన తర్వాత అక్కడ తాంబూలంలో ఇచ్చే రవికను కూడా ఇదే విధంగా ధరించాలి. ముఖ్యంగా స్త్రీలు అమ్మ వారి నుంచి స్వీకరించిన చీరలను రాత్రి సమయంలో ధరించి పడకగదికి వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు. కేవలం పూజా సమయంలో మాత్రమే వీటిని ధరించడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుందని అంటున్నారు.