Amla For Hair : ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా, అందమైన కురులని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు. మీరు కూడా, అందమైన కురులని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే, ఇలా చేయండి. ఇలా చేయడం వలన జుట్టు చాలా అందంగా మారుతుంది. షైనీగా ఉంటుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. మంచి స్మూత్ హెయిర్ కోసం, చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా, అందమైన సిల్క్ హెయిర్ కోసం చూస్తున్నారా..? అయితే, ఇలా చేయాల్సిందే.
ఉసిరి ఇందుకు బాగా పనిచేస్తుంది. ఉసిరి వలన అనేక లాభాలు ఉంటాయి. ఉసిరి వలన ఆరోగ్య ప్రయోజనాలనే కాదు. ఉసిరితో అందమైన కురులని కూడా, పొందవచ్చు. ఉసిరితో అందమైన కురులని పొందడానికి ఇలా చేయండి. ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మంచి పెరుగును తీసుకోండి. కొద్దిగా ఉసిరి పొడిని తీసుకుని, పెరుగులో మిక్స్ చేయండి. ఈ రెండిటిని బాగా మిక్స్ చేసి, తలకి బాగా పట్టించండి. మృదువుగా మీరు మీ తలకి పట్టించండి. ఆ తర్వాత ఒక 40 నిమిషాల వరకు అలా వదిలేసి, తర్వాత తలస్నానం చేయండి.
కండిషనర్ తో తల స్నానం చేయడం మర్చిపోకండి. ఇలా చేయడం వలన, అందమైన కురులని సొంతం చేసుకోవచ్చు. జుట్టు సిల్కీగా, స్మూత్ గా మారుతుంది. ఉసిరి, కరివేపాకు కూడా చక్కగా పనిచేస్తాయి. తాజా ఉసిరికాయలను తీసుకుని, ముక్కలు కింద కట్ చేసుకోండి.
మిక్సీ పట్టేసి, పక్కన పెట్టుకొని, ఇందులో కొన్ని కరివేపాకు ఆకులు వేసి కొంచెం నీళ్లు పోసి మళ్లీ ఒకసారి మిక్సీ పట్టండి. ఈ మిశ్రమాన్ని తలకి బాగా పట్టించండి. ఆరిపోయిన తర్వాత షాంపూ తో తలస్నానం చేయండి. ఇలా, ఈ రెండు చిట్కాలతో మీరు అందమైన కురుడని పొందొచ్చు. జుట్టు చాలా సాఫ్ట్ గా మారుతుంది. షైనీ గా ఉంటుంది.