Pressure Cooker Water Leakage : ప్రెషర్ కుక్కర్లో మనం ఈజీగా వంట చేసుకోవచ్చు. తక్కువ సమయంలోనే, మనం వంటని పూర్తి చేసుకోవడానికి అవుతుంది. కూరగాయలు, బియ్యం, పప్పు వంటివి ఉడకబెట్టుకోవడానికి, ప్రెషర్ కుక్కర్ మనకి బాగా అవసరం అవుతుంది. అయితే, ఒక్కొక్కసారి విజిల్ నుండి నీరు కారిపోతూ ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ మురికిగా మారిపోతుంది. గ్యాస్ స్టవ్ కూడా మరకలతో ఉండిపోతుంది. చాలామంది, కుక్కర్ ని, గ్యాస్ స్టవ్ ని క్లీన్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. ఈ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది.
కుక్కర్ ని మనం ప్రతి రోజు వాడుతూ ఉంటాము. సో, కొన్నాళ్ళకి రబ్బర్ వదులుగా అయిపోతుంది. కుక్కర్ లీక్ అవ్వడానికి, రబ్బర్ లూస్ అయిపోవడం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఈ రకమైన సమస్య ఉంటే, కుక్కర్లోని రబ్బర్ని మధ్యలో చూస్తూ ఉండండి. ఒకవేళ కనుక అది వదులుగా మారిపోయినట్లయితే, పిండి ముద్ద తయారు చేసి కుక్కర్ ని కవర్ చేయండి. ఇలా చేయడం వలన లీక్ అవ్వదు.
కుక్కర్ ని ఉపయోగించడం కూడా ఈజీ అవుతుంది. ఏ ఇబ్బంది కూడా మీకు రాదు. వంట చేసేటప్పుడు, ఆహారం తరచుగా విజిల్ లో చిక్కుకుంటుంది. ఆవిరిని చెయ్యదు. కుక్కర్ నుండి నీరు రావడం మొదలవుతుంది. ప్రెషర్ కుక్కర్ ని వాడే ముందు, కచ్చితంగా విజిల్ ని చెక్ చేయండి. విజిల్ లోపల ఏమీ లేకుండా చూసుకోండి. కొన్ని కొన్ని సార్లు చాలాసేపటి వరకు విజిల్ రాదు. నీళ్లు లీక్ అవడం మొదలవుతుంది. అలా కుక్కర్ నుండి విజిల్ రాకుండా నీళ్లు లీక్ అవ్వడం తర్వాత బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఎప్పుడైనా సరే కుక్కర్ మూత పెట్టేటప్పుడు, మూత సరిగ్గా ఫిక్స్ అయిందో లేదో చూసుకోండి. సరిగ్గా ఫిక్స్ అవ్వకపోతే, కాసేపు చల్లటి నీటిలో నానబెట్టి, తర్వాత మళ్ళీ క్లోజ్ చేయండి. ప్రెషర్ కుక్కర్ నుండి నీళ్లు రాకుండా ఉండాలంటే, నూనెను కూడా ఉపయోగించవచ్చు. కుక్కర్ మూత మూసే ముందు చుట్టూ నూనె రాయండి. ఇలా, ఈ చిన్న చిన్న చిట్కాలతో, ఈజీగా కుక్కర్ ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ సమస్య కూడా ఉండదు.