Dreams : ప్రతి ఒక్కరు నిద్రపోయిన తర్వాత కలలు రావడం చాలా సహజం. ఏదో ఒక కల మనకి తరచూ వస్తూనే ఉంటుంది. ఎక్కువగా మనం ఆలోచించే వాటి మీద కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఇటువంటి కలలు కూడా వస్తూ ఉంటాయి. ఈ కలలకి అర్ధాలు ఏమిటో ఈరోజు చూద్దాం.. కలలో కనుక మీకు కుంకుమ కనపడితే కీర్తి అదృష్టం కలుగుతుంది. ఒకవేళ వంటగది మీకు కనపడినట్లయితే అప్పుల నుండి విముక్తి పొందుతారు.
గుర్రపు స్వారీ చేసినట్లు కనుక కల వస్తే మీరు చేసే పనిలో మీకు విజయం కలుగుతుంది. పుస్తకాలు కనుక కలలో కనపడ్డాయి అంటే మానసిక వికాసం. దీపం మీకు కలలో కనపడితే కుటుంబంలో ఆనందం కలుగుతుంది, క్షేత్రాలు మీకు కలలో కనపడితే అది మీకు శుభసంకేతం. నిధులు కలలో కనపడ్డాయి అంటే సంపదని పొందుతారు. క్షేత్రాలు కనబడితే అది శుభసంకేతం. జలపాతాలు కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి పొందుతారు.
గంధపు చెక్కలు కనబడితే అది శుభసంకేతం. ఇంద్రధనస్సు కలలో కనపడితే ఆనందం కలుగుతుంది. తలపాగా కలలో కనిపిస్తే గౌరవం పెరుగుతుంది. అద్దాలు కనపడితే కోరికలు తీరుతాయి. కలలో పర్వతం కనపడితే జీవితంలో పురోగతి. కలలో సంఖ్యలు కనపడితే లాటరీ సంపాదన. పువ్వులు కనుక కలలో కనపడ్డాయంటే మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. కలలో జుట్టు కత్తిరించుకున్నట్లు వస్తే అప్పటి వరకు ఉన్న సమస్యలు పోతాయి.
నల్ల మేఘాలు కనుక మీకు కలలో కనపడితే వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. తమలపాకులు కనుక కలలో కనపడితే సంపద సంతోషం కలుగుతుంది. కలలో బంగారం వేసుకున్నట్టు కల వస్తే అపార సంపదలు మీ జీవితంలోకి వస్తాయి. పక్షులు కనపడితే అదృష్టం, సంపద, విజయం. వండిన మాంసం కలలో కనబడింది అంటే సంపద పెరుగుతుంది. అదే పచ్చి మాంసం కనబడితే దరిద్రం, సంపద తగ్గుతుంది. దేవతలు కానీ గోవులు కానీ అగ్ని సరస్సులు కానీ కన్యలు కానీ కనబడితే ధనం, ఆరోగ్యం.