Foods For Cholesterol : చాలామంది, రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. సరైన ఆహార పదార్థాలను తీసుకోకపోవడం, మారుతున్న జీవనశైలి ఇలా పలు కారణాల వలన, చెడు కొలెస్ట్రాల్ సమస్యతో, చాలా మంది బాధపడుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నట్లయితే, ఇంట్లో ఉండే, కొన్ని మసాలా దినుసులు తీసుకుంటే, మంచిది. వీటి వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మసాలా దినుసుల్లో ఉండే ఔషధ గుణాలు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించగలవు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి, పసుపు బాగా సహాయం చేస్తుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకుని, లేదంటే ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకుని, అందులో చిటికెడు పసుపు వేసి బాగా కలిపి తీసుకుంటే చాలు. కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి, నల్ల మిరియాలు కూడా బాగా ఉపయోగపడతాయి. నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఔషధ గుణాలు కూడా ఇందులో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ నల్ల మిరియాల్లో ఎక్కువ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించగలవు. పావు స్పూన్ లో సగం మిరియాల పొడిని, ప్రతి రోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటే, చక్కటి ఫలితం ఉంటుంది.
మీరు తినే ఆహారం మీద, కొద్దిగా మిరియాల పొడి జల్లుకోవడం లేదంటే పాలల్లో కలుపుకుని తీసుకోవడం ఇలా చేయవచ్చు. మెంతులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మెంతులను తీసుకుంటే కూడా, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలానే, మెంతులు ని వేయించి పొడిగా చేసుకుని, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ పొడిని వేసుకుని తీసుకుంటే, మంచిది. లవంగాలని కూడా తీసుకుంటూ ఉండండి.
ఇది కూడా కొలెస్ట్రాల్ని కరిగించగలదు. రోజు ఒక లవంగం నమిలి ఆ రసాన్ని మింగినా చాలు, చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి అవుతుంది. ధనియాలు కూడా బాగా పనిచేస్తాయి. ధనియాలని కషాయంగా తయారు చేసుకుంటే మంచిది. లేకపోతే ధనియాల పొడినైనా తీసుకోవచ్చు. దాల్చిన చెక్క కూడా చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించగలదు. ఇలా, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని వీటితో తగ్గించుకోవచ్చు.