Samantha : నాగ చైతన్య- సమంత.. టాలీవుడ్ క్రేజీ జంట. ఈ ఇద్దరు విడిపోవడం ఏ ఒక్కరికి రుచించడం లేదు. తిరిగి కలిస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు. కాని అది అసాధ్యం అయింది. ఎవరి పనులతో వారు ప్రస్తుతం బిజీగా ఉంటుండగా, వీరిద్దరికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. అయితే నాగ చైతన్య, సమంత పెళ్లి రెండు పద్ధతుల్లో జరిగిన విషయం తెలిసిందే. వీరు క్రిష్టియన్ పద్దతిలో అలాగే హిందూ పెద్దలో పెళ్లి చేసుకున్నారు. అందువల్ల వీరు విడిపోయిన తర్వాత నాగ చైతన్య కట్టిన తాళిని సమంత ఏం చేసింది అనే అనుమానం అందరికి కలుగుతుంది.
నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత అతను ఇచ్చిన అన్ని బహుమతులను తిరిగి నాగ చైతన్యకు ఇచ్చినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే మెడలో తాళి ఏం చేసిందనే విషయంపై ఇప్పుడు పలు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సమంత మెడలో ఉన్న తాళి బొట్టు దగ్గుబాటి లక్ష్మీ వాళ్ళ అమ్మ కూతురికి వారసత్వంగా ఇచ్చిందట. అయితే విడాకులు తీసుకున్న తర్వాత తన దగ్గర ఉన్న నగలు, బట్టలు ప్యాక్ చేసి తన మేనేజర్ ద్వారా దగ్గుబాటి ఫ్యామిలీకి పంపించిందట. సమంత ధరించిన తాళి బొట్టులో ఒకటి దగ్గుబాటి ఫ్యామిలీది. మరొకటి వాళ్ళ అమ్మ ఇచ్చిందట.
తమ తల్లిగారు ఇచ్చిన తాళి బొట్టును మాత్రం తన వద్దే ఉంచుకుందట. సమంత వ్యవహారం ఇటీవలి కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది. తాళి విలువ సమంత కి తెలుసు అని, తను ఎక్కువగా హిందూ సాంప్రదాయాలను ఫాలో అవుతుంది.. అందుకే ఇప్పటికీ తన తాళి తన దగ్గరే ఉంచుకుందని కొందరు చెప్పుకొస్తున్నారు.