Pushpa 2 : మెగా హీరోగా ఇండస్ట్రీకి వచ్చి ఒక్కో సినిమా చేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు అల్లు అర్జున్. అయితే ఇప్పుడు బన్నీ మెగా హీరోగా కాకుండా తనకు ఆర్మీ ఉందని చెబుతూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాడు. కొద్దిరోజులుగా అల్లు అర్జున్ వ్యవహారశైలి.. జన సైనికులు, మెగా ఫ్యామిలీకి చాలా బాధ కలిగిస్తుంది. అల్లు అర్జున్ నంద్యాల టూర్, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు పలకడం వల్ల గొడవ పెద్దదైంది. ఆ తర్వత నాగబాబు ఇండైరెక్ట్‌గా బన్నీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. అది బాగా వైరల్ అయింది. తరువాత ఆ పోస్ట్ డిలీట్ చేశారు. అయినప్పటికీ పవన్ గెలుపు తర్వాత ఇంటికి వెళ్లి మెగా బ్రదర్స్ ఆశీస్సులు తీసుకుంటున్న సమయంలో అల్లు అర్జున్ అక్కడ కనపడకపోవడం కూడా రకరకాల కథనాలకు ఊతమిచ్చింది.
కొద్ది రోజుల తర్వాత పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్లిన పవన్ అక్కడ మాట్లాడుతూ కల్చరల్‌గా సొసైటీలో చాలా చేంజ్ వచ్చింది అన్నారు. ఒకప్పుడు అడవులను కాపాడే వాళ్ళు సినిమాల్లో హీరోలు అయితే ఇప్పుడు స్మగ్లర్లు హీరోలుగా మారారు అని అనడంతో అల్లు అర్జున్‌ని టార్గెట్ చేసి పవన్ అలా అన్నారా అని అందరు భావించారు. ఇలా మెగా అభిమానులు, అటు అల్లు అర్జున్ అభిమానులు ఇరువురు కామెంట్స్ హైలైట్ చేస్తూ గొడవలు పడుతున్నారు. అయితే వైసీపీ అంటే పడని పవన్ కళ్యాణ్‌కి పోటీగా ఇప్పుడు బన్నీ నుండి సెగ పెట్టాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఈ ఎలక్షన్స్‌లో వైసీపీ లీడర్ కోసం బన్నీ ఏకంగా నంద్యాల వెళ్లడం మనం చూశాం. ఇక ఇప్పుడు ఆయన కోసం అంబటి రాంబాబు ప్రమోషన్ చేస్తున్నారు.పుష్ప-2 సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావటంతోపాటు మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు పుష్ప-2 సినిమా గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. అంబటి ట్వీట్ ప్రకారం..‘పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా.. కాదు వరల్డ్ ఫైర్’ అంటూ పేర్కొన్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పుష్ప-2 అద్భుత విజయాన్ని అందుకుందన్న అర్థం వచ్చేలా అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. బన్నీని పొగిడేస్తున్న అంబటి మెల్లగా మెగా- అల్లు ఫ్యామిలీల మధ్య మరింత అగ్గి రాజేయాలని అనుకుంటున్నాడా ఏంటని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.