Vastu Tips : సాధారణంగా మన ఇంట్లో మనం ఎంతో ప్రేమించే వ్యక్తులు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేనిది. అలాంటి వ్యక్తి మరణించడం వల్ల ఆ వ్యక్తిని దైవ సమానంగా భావిస్తారు. ఈ క్రమంలోనే అలాంటి వారి ఫోటోను ఏకంగా దేవుడి గదిలో ఉంచి పూజలు చేస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో ఎలాంటి పరిస్థితులలోనూ పెట్టకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫోటోలను దేవుడి గదిలో ఉంచడం వల్ల ఆ ఫోటోలు మన దృష్టిని, ఆలోచనలను పక్కకు మరల్చడమే కాకుండా ఆ వ్యక్తితో మరపురాని జ్ఞాపకాలను తరచూ గుర్తు చేస్తూ మరింత కుంగుబాటుకు కారణమవుతాయి. అందుకోసమే చనిపోయిన వారి ఫోటోలను ఎల్లప్పుడూ కూడా దేవుడి గదిలో ఉంచకూడదు. ఒకవేళ అలా వచ్చి ఎవరైనా పూజలు చేస్తూ ఉంటే వెంటనే ఆ ఫోటోలను తీసేయాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇక ఇలా చనిపోయిన వారి ఫోటోలను ఎల్లప్పుడూ కూడా హాల్లో ఎత్తయిన ప్రదేశంలో ఉంచుకోవాలి. అంతేకానీ చనిపోయిన వారి ఫోటోలను దేవుడి గదిలో మాత్రం ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల మన దృష్టి, ఏకాగ్రత ఆ దేవుడిపై ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక పూజ గదిలో ఎల్లప్పుడూ దేవుడి విగ్రహాలు, ఫోటోలు మాత్రమే ఉండాలి. అయితే దేవుడి విగ్రహాలు చిన్న సైజులో ఉండేవి తీసుకోవడం ఎంతో ఉత్తమమని పండితులు తెలియజేస్తున్నారు.