Beeruva Direction In Home : చాలామంది రకరకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా సమస్యలతో సతమతమవుతున్నారా..? ముఖ్యంగా డబ్బు సమస్యలు ఉన్నట్లయితే, ఇలా చేయడం మంచిది. ఈ రోజుల్లో, చాలామంది డబ్బు సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం వంటివి జరుగుతున్నాయి. చాలా మంది, నెల అంతా కూడా కష్టపడుతూ ఉంటారు. కానీ వచ్చిన జీతం, వెంటనే ఖర్చు అయిపోతుంది. డబ్బులు అసలు ఇళ్లల్లో నిలవవు. ఇటువంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే, కచ్చితంగా వాస్తు ప్రకారం పాటించడం మంచిది.
వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన, ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మీ ఇంట కూడా డబ్బు సమస్యలు ఉన్నాయా..? డబ్బు సమస్యలతో మీరు బాధపడుతున్నారా..? అయితే, ఇలా చేయండి. మీ ఇంట్లో, బీరువాని ఈ దిక్కులో పెట్టడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, తూర్పు దిశని పురోగతి అలానే శక్తుల దిశ అంటారు. ఈ దిశకి అధిపతి దేవతల రాజు ఇంద్రుడు. సంపదని మీరు రక్షించుకోవాలంటే, బీరువాని పశ్చిమ దిశలో, తూర్పు దిశలో పెట్టడం మంచిది. ఐశ్వర్యం పెరుగుతుంది.
ఎప్పుడు బీరువాని, దక్షిణ దిశకు ఎదురుగా పెట్టకూడదు. ఇలా ఉన్నట్లయితే, డబ్బు నష్టం కలుగుతుంది. ఇంట్లో డబ్బు, ఆభరణాలు పెరగాలంటే దక్షిణం వైపు ఉత్తరం వైపు బీరువా ఉండేటట్టు పెట్టుకోవడం కూడా మంచిది. ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు. కాబట్టి, ఇంట్లో సంపద పెరగాలన్నా, లక్ష్మీదేవి మీ వెంట కొలువై ఉండాలన్నా, ఈ దిశలో బీరువాని పెట్టుకోవడం మంచిది. అలానే సంపద పెరగాలన్నా డబ్బులును బాగా పొదుపు చేసుకోవాలన్నా బీరువాని పడమర వైపు అసలు పెట్టకండి.
ఎందుకంటే, ఈ దిశ కి అధిపతి వరుణుడు. బీరువాని ఈ దిశలో ఉంచినట్లయితే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. డబ్బులు కూడా, ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. దిక్కుతో పాటుగా బీరువాని పెట్టేటప్పుడు. ఈ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. బీరువా ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. బీరువా కింద చెత్తాచెదారం, వంటివి ఉండకూడదు. ముదురు ఆకుపచ్చ లేదా ముదురు ఎరుపు రంగులో బీరువా ఉండకూడదు. ఈ విషయాలను గుర్తుపెట్టుకుంటే మంచిది.