ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. పుష్ప సినిమాతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ మూవీలో ఆయన మాస్ పాత్రలో ప్రేక్షకులను అలరించారు. దేశవ్యాప్తంగా పుష్ప మొదటి భాగం ఊహించని స్థాయిలో హిట్ అందుకుంది. దీంతో అల్లు అర్జున్‌కు అటు బాలీవుడ్‌లో కూడా డిమాండ్ ఏర్పడింది. అల్లు అర్జున్ తో బాలీవుడ్ దర్శక నిర్మాతలు సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ -2 రిలీజ్ అయింది.
ఇక అసలు విషయానికి వెళ్తే అల్లు అర్జున్ రాఘవేంద్రరావు దర్శకత్వం వచ్చిన గంగోత్రి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గంగోత్రి సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. గంగోత్రి చిత్రం కన్న మొదటి గా బన్నీ ఒక సూపర్ హిట్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవ్వాల్సి ఉందట. ఆ సినిమా ఏంటంటే..
తేజ దర్శకత్వంలో నితిన్, సద హీరో హీరోయిన్ లు గా నటించిన జయం. అయితే ఈ సినిమాలో మొదటిగా అల్లు అర్జున్ ను హీరోగా తీసుకోవాలని అనుకున్నారట. జయం చిత్రంతో అల్లు అర్జున్ ని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నారట దర్శకుడు తేజ.
కానీ ఆ అవకాశం కాస్త రాఘవేంద్రరావు దక్కించుకున్నారు. అప్పటికే బన్నీని రాఘవేంద్రరావు గంగోత్రి సినిమా కోసం సంప్రదించడం జరిగింది. దాంతో నైజాం ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి తనయుడు నితిన్ ను హీరోగా జయం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు తేజ. సరికొత్త కథాంశంతో క్లాసిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన జయం చిత్రం జూన్ 14, 2002 లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది.