Sardar : సర్దార్.. అనే పదం వినడానికి ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుంది. సర్దార్ అనే పేరుతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే సర్దార్ అనే టైటిల్ తగిలించుకుని వెండి తెర పైకి వచ్చిన ఏ చిత్రాలు హిట్.. ఏ చిత్రాలు ప్లాప్.. అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటిగా సర్దార్ అనే పేరుతో వచ్చిన చిత్రం సర్దార్ పాపారాయుడు. దాసరినారాయణ రావు దర్శకత్వంలో నటసార్వభౌమ ఎన్టీఆర్ హీరోగా 1980 సంవత్సరంలో సర్దార్ పాపారాయుడు అనే సినిమా వచ్చింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం నటించి ప్రేక్షకులను అలరించారు. అక్టోబర్ 30, 1980 లో దీపావళి కానుకగా విడుదలైన సర్దార్ పాపారాయుడు బ్లాక్ బస్టర్ గా నిలిచి భారీ వసూళ్లను రాబట్టింది.
1987లో రెబల్ స్టార్ కృష్ణం రాజు హీరోగా భాస్కర రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్దార్ ధర్మన్న. ఈ సినిమాలో కృష్ణంరాజు సరసన రాధిక, జయసుధ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ కాలేకపోయింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఏ. కోదండిరామిరెడ్డి దర్శకత్వంలో 1987లో సర్దార్ కృష్ణమనాయుడు సినిమా విడుదలయ్యింది. ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్ గా నటించారు. ఊర్వశి,శారదలు ముఖ్యపాత్రలలు పోషించారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది.
2016లో కె.ఎస్. రవీంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఈ చిత్రాన్ని గబ్బర్ సింగ్ హిట్ తరవాత దానికి కొనసాగింపుగా తెరకెక్కించారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఖైదీ చిత్రం తర్వాత కార్తీ శివకుమార్ చిత్రం సర్దార్. ఈ చిత్రంలో కార్తీ.. విజయ్ కుమార్ అనే క్యారెక్టర్ లో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా, గూడచారిగా ద్విపాత్రాభినయంలో నటించారు. సర్దార్ చిత్రం సక్సెస్ టాక్ తో ముందుకు దూసుకుపోయింది.