Acharya Chanakya : ఆచార్య చాణక్య చాలా అద్భుతమైన విషయాలని చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన, మన జీవితం ఎంతో బాగుంటుంది. ఎంతో అద్భుతంగా సాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా, జీవితంలో గెలవాలి. లేకపోతే అక్కడే ఉండిపోతారు. చాణక్య జీవితంలో గెలవాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి అనే విషయాన్ని కూడా చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన, కచ్చితంగా మనం జీవితంలో గెలుస్తాము. ఆచార్య చాణక్య చెప్పిన విషయాలను ఇప్పుడే చూసేద్దాం.
మనిషి చేసే పనుల వలన దుఃఖం, ఆనందం రెండూ కలుగుతూ ఉంటాయని, ఒక్కొక్కసారి దుఃఖం కలిగితే, ఒక్కొక్కసారి ఆనందం కలుగుతుందని చాణక్య అన్నారు. ఒక వ్యక్తి తన కర్మల ద్వారా. దుఃఖాన్ని అలానే ఆనందాన్ని అనుభవిస్తాడని చాణక్య చెప్పారు. వర్తమానంలో చేసిన పనులైనా, గతంలో, పూర్వజన్మలో చేసిన పనైనా సరే అనుభవించి తీరుతాడని చాణక్య చెప్పారు.
మనిషి అలవాట్ల వలన, తన జీవితంపై ఎటువంటి ప్రభావం పడుతుంది అనేది కూడా చాణక్య చెప్పుకొచ్చారు. మనిషికి సమస్యలు రావడానికి మూల కారణం తన మనసు అని చాణక్యం అన్నారు. ఒక వ్యక్తి యొక్క మనసు అదుపులో లేకపోతే, ఆ వ్యక్తి సంతోషంగా సంతృప్తిగా ఉండలేడని చాణక్య అన్నారు. మనసుని అదుపులో ఉంచుకులోని వాళ్ళు సంతోషంగా ఉండలేరట. ఇతరుల సంతోషాన్ని చూసి, విచారించే వ్యక్తి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేడు.
అలానే, లక్ష్యాన్ని చేరుకోవాలంటే సాంగత్యం, క్రమశిక్షణ, మనసుపై నియంత్రణ ఉంటే సాధించవచ్చని చాణక్య అన్నారు. సో, ఎవరైనా గెలవాలంటే, లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఖచ్చితంగా వీటిని అలవాటు చేసుకోవాలి. చెడు పనులకు పాల్పడే వ్యక్తి దగ్గర లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని, లక్ష్మీదేవి వాళ్ళకి దూరంగా ఉంటుందని కూడా చాణక్య చెప్పారు. కాబట్టి, క్రమశిక్షణతో పనులు పూర్తి చేయండి. మనసుపై నియంత్రణ పెట్టుకోండి. సంతోషంగా ఉండండి. అనుకున్నది సాధించండి.