Monkey In Dream : రాత్రిపూట నిద్రలో కలలు రావడం సహజం. ఇది అందరికి ఎప్పుడూ ఒక్కసారి జరుగుతూనే ఉంటుంది. కొన్ని కలలు మనకు ఆనందాన్ని కలిగిస్తే, మరికొన్ని బాధను కలిగిస్తాయి. ఒక్కోసారి మనకు వచ్చిన చెడు మరియు భయంకరమైన కలల కారణంగా నిద్రలో ఉలిక్కిపడి లేస్తుంటాము కూడా. అలాగే కలల శాస్త్రం ప్రకారం మనకు వచ్చే కల ఒక సంకేతం. మనకు కలలో కనిపించే ప్రతి దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది. అలాగే కలలో కొందరికి కోతులు కనిపిస్తూ ఉంటాయి. కలలో కోతులు కనిపిస్తే మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో చాలా మందికి తెలియదు. అయితే కలలో కోతులు కనిపించడం మంచిదా.. కాదా.. ఇది దేనికి సంకేతం.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులు కోతిని కూడా పవిత్రంగా భావిస్తారు.
కోతిని హనుమంతుడి ప్రతీకగా భావిస్తారు. కనుక కలలో కోతి కనిపించడం విశేషం. అయితే కలలో కోతిని వేర్వేరు స్థానాల్లో చూడడం వల్ల వేర్వేరు అర్థాలు వస్తూ ఉంటాయి. కలలో కోతి నవ్వుతున్నట్టు కనిపిస్తే అది శుభదాయకం. జీవితంలో మంచి జరగబోతుందని అర్థం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అర్థం. స్నేహితులతో ఉన్న వివాధాలు తగ్గడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు వస్తాయని ఇవి సూచిస్తాయి. అలాగే కోతుల సమూహం కనిపిస్తే కూడా శుభదాయకం. కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుందని దీని అర్థం. అంతేకాకుండా ఆర్థికంగా మంచి చేకూరుతుందని, నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుందని దీని అర్థం. అలాగే కలలో కోతి ఏదైనా తింటూ కనిపించడం అంత మంచిది కాదు.
ఇది మనకు నష్టాన్ని కలిగిస్తుందని అర్థం. అలాగే మీ కుటుంబం భవిష్యత్తులో సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందని అర్థం. అంతేకాకుండా ఆర్థికంగా నష్టాలు కూడా కలగవచ్చని దీని అర్థం. అలాగే కోపంగా ఉన్న కోతి కలలో కనిపిస్తే అశుభం. కోపంగా ఉన్న కోతి కలలో కనిపిస్తే మీకు దగ్గరగా ఉన్న వారితో గొడవలు జరిగే అవకాశం ఉందని దాని అర్థం. అంతేకాకుండా మీ గౌరవ మర్యాదలు కూడా దెబ్బతింటాయి. ఈ విధంగా కలలో కనిపించే ఒక్కో కోతి ఒక్కో అర్థాన్ని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.