మన హిందువులు ఆచార వ్యవహారాలకు ఎంత గౌరవం ఇస్తారో వాస్తు శాస్త్రాలను కూడా అదేవిధంగా నమ్ముతారు. ఈ క్రమంలోనే ఇంట్లోపెట్టుకొని అలంకరణ వస్తువుల నుంచి మొక్కలు వరకు ప్రతి ఒక్కటి వాస్తు శాస్త్రం ప్రకారం అలంకరించుకుంటారు. ఈ క్రమంలోనే హిందువులు వెదురు మొక్కలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు మొక్కలను మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల అదృష్టం కలిసివస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత కాలంలో దొరికే హైబ్రిడ్ వెదురు మొక్కలు పెద్ద ఎత్తున పెరగవు కనుక వీటిని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల కుటుంబ సభ్యులు ఎంతో మానసిక సంతోషంతో పాటు ఆయురారోగ్యాలతో ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ వెదురు మొక్కను మన ఇంట్లో తూర్పు వైపు ఉంటే అదృష్టం కలిసి వస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
హిందువులు తూర్పు వైపును ఎంతో పవిత్రంగా భావిస్తారు. సృష్టికి వెలుగునిచ్చే సూర్యభగవానుడి తూర్పున ఉదయించడం వల్ల తూర్పు వైపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మనం పూజ చేయటం కానీ ఏదైనా శుభకార్యాలను చేయటం కానీ తూర్పు వైపుకు తిరిగి చేస్తారు. అందుకోసమే ఈ వెదురు మొక్కలను తూర్పువైపు ఉంచడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని, ఈ వెదురు మొక్కలు నుంచి వెలువడే సుగంధ పరిమళాలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.