Balakrishna : నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆనతి కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ గురించి ఆయనతో పని చేసిన డైరెక్టర్లు ఎంతో గొప్పగా చెబుతారనే సంగతి తెలిసిందే. అభిమానులకు ఎంతో విలువ ఇచ్చే స్టార్ హీరోలలో బాలకృష్ణ ఒకరు కాగా, ఆయన ఎప్పుడు నిర్మాతల శ్రేయస్సును కోరుకుంటారని ఆయనతో పని చేసిన నిర్మాతలు చాలా సార్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా కూడా ఆదుకునే హీరోలలో బాలకృష్ణ ముందువరసలో ఉంటారు.
బాలకృష్ణ చూడడానికి చాలా సీరియస్‌గా కనిపిస్తారు. కాని ఆయన మనసు మాత్రం వెన్న అని అభిమానులు చెబుతుంటారు. ఎన్నో హిట్ చిత్రాలతో అలరించిన బాలకృష్ణ సినిమాలలో ఒక కామన్ పాయింట్ ఉంది. బాలయ్య తన సినిమాలలో వరుస ఆఫర్ లతో బిజీ ఉండే ఇతర భాషలకు చెందిన నటుల కంటే అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తెలుగు వారికే ఎక్కువగా ఆఫర్స్ ఇస్తుంటాడు. ఆఫర్ ల కోసం ఎదురు చూస్తున్నవారికి అవకాశం ఇవ్వడం వల్ల కొత్తవారికి ఛాన్స్ ఇచ్చినట్టు అవ్వడంతో పాటూ వారి టాలెంట్ నిరూపించుకోవడానికి మనం ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని దర్శక నిర్మాతలకు చెబుతుంటాడట.
బాలయ్య మంచి మనస్సు గురించి తెలుసుకున్న అభిమానులు ఆయనని అందుకే జై బాలయ్య అని పొగిడేస్తుంటారు. ఇక అఖండ సక్సెస్ తో బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తున్నారు బాలయ్య . ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఆయన త్వరలో డాకు మహారాజ్‌తో మన ముందుకు రానున్నారు.