టైటిల్ చూడగానే భయపడిపోయి ఉంటారు. కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి. ఆ చేదును భరించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది కూడా అంతే. ఆరోగ్యానికి నిద్ర ఎంత కీలకమో.. అతి నిద్ర అంతే హానికరమట. ఇదేదో మేం చెబుతున్నది కాదు.. తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. చాలామందికి నిద్రంటే చాలా ఇష్టం.
ఎంతసేపు పడుకోమన్నా అలాగే పడుకుంటారు. కాని.. అటువంటి వాళ్లు మాత్రం ఇప్పుడైనా కాస్త ఆలోచించాల్సిందే. లేదంటే ఎప్పుడు పుటుక్కుమనేది తెలియదని రీసెర్చర్స్ చెబుతున్నారు. నిద్ర సరిగా లేకపోతే ఎటువంటి సమస్యలు వస్తాయో.. అతిగా నిద్రపోయినా సమస్యలే వస్తాయి.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏమంటోందంటే.. రోజుకు 9 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోతే అకాల మరణం ముప్పు ఎక్కువగా ఉంటుందని తేల్చేసింది. ఇంకా 10 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోయేవారిలో 33 శాతం మంది త్వరగా చనిపోతారట. అంతే కాదు.. గుండెకు సంబంధించిన సమస్యలు 10 గంటల కంటే ఎక్కువగా నిద్రపోయేవాళ్లకే ఎక్కువగా వస్తాయట. వామ్మో.. నిద్ర తక్కువ పోయినా కష్టమే.. ఎక్కువ పోయినా కష్టమేనా దేవుడా.