డేట్ ఒకటి రెండు రోజులు అటు ఇటు గా వస్తే ఏమవుతుంది. దాని వలన పెద్ద సమస్యలు ఏముంటాయ్ చెప్పండి. డేట్ ఒకటి రెండు రోజులు అటు ఇటు రాగానే ఇలాగే అనుకుంటారు చాలా మంది ఆడవాళ్ళు. కాని అది ఎంత మాత్రం మంచిది కాదని చెప్తున్నారు వైద్యులు. అమెరికన్ సొసైటీ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్ ఒక వ్యాసాన్ని ప్రచురించింది. అందులో కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
కొన్ని పరిశోధనల ప్రకారం… దీర్ఘ కాలం పీరియడ్స్ డేట్ లో మార్పులు వస్తే ప్రాణానికే ప్రమాదం అంటున్నారు. వారిలో గుండె జబ్బులు, ప్రాణంతక వ్యాధులు వస్తున్నాయని దీనితో చిన్న వయసులోనే మరణిస్తున్నారు అని చెప్పారు. అది కేవలం లైంగిక రుగ్మత మాత్రమే కాదని అంటున్నారు. అది చాలా సార్లు ప్రధాన జీవక్రియలను కుంటుపరిచే మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యకు మూలం కూడా కావచ్చుని అని హెచ్చరిస్తున్నారు.
రుతుక్రమ సంబంధమైన ఏ సమస్యలూ లేని వారితో పోలిస్తే, ఈ తేడాలు ఉన్నవారు తరచూ పలు వ్యాధులతో బాధపడుతున్నారని ఈ సమస్య జీవిత కాలాన్ని తగ్గిస్తుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి పీరియడ్స్ డేట్ లో మార్పులు వస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించి తగు పరిష్కార మార్గాలను చూసుకోకపోతే మీ జీవితానికి ప్రమాదమని అది లైట్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.