7G Brundavan Colony : ఒకప్పుడు యూత్ ను ఎంతగానో అలరించిన సూపర్ హిట్ చిత్రం 7/జీ బృందావనం కాలనీ.ఈ చిత్రాన్ని ఇటీవలే రీ రిలీజ్ కూడా చేశారు. ఇప్పటికీ చిత్రంలోని పలు సన్నివేశాలు, పాటలు, కామెడీ సీన్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్న విషయం తెలిసిందే. అయితే సినిమాను రీరిలీజ్ చేసిన సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌కి చిత్ర యూనిట్ హాజరైంది. ఈ సందర్భంగా రవికృష్ణను చూసిన వారందరూ షాక్ అయ్యారు. చాలా కాలంగా కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఆయన్న చూసి గుర్తు పట్టలేకపోయారు.
ప్రస్తుతం ఆయన లావుగా మారిపోయారు. ఫేస్ పూర్తిగా బుగ్గలతో నిండిపోయింది. దీంతో సడెన్ గా చూసిన వారు గుర్తుపట్టడం కష్టమే అన్నట్టుగా లేటెస్ట్ లుక్ ఉంది. ప్రస్తుతం ఆయన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సుమన్ శెట్టి లుక్ కూడా కొంత మారింది. ఆయన తనదైన స్టైల్‌లో పంచ్‌లు విసురుతూ మాట్లాడారు. అలానే సినిమాలోని డైలాగ్ కూడా చెప్పి నవ్వించారు. సోనియా అగర్వాల్ మాత్రం అంతే ఉంది. 20 ఏళ్ల తర్వాత వీరిని ఇలా చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతానికి అయితే వీరి పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
ప్రముఖ నిర్మాత ఎంఏం రత్నం కొడుకు రవికృష్ణ హీరోగా 7/జీ బృందావనం కాలనీ . ఈ చిత్రానికి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. సోనియా అగర్వాల్ కథానాయిక. సుమన్ శెట్టి, చంద్రమోహన్ కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఇప్పటికీ సంగీత ప్రియులు మరిచిపోలేదు. దాదాపు 20 ఏళ్ల కింద 7/జీ బృందానం కాలనీ చిత్రం విడుదల అయింది. ఈ చిత్ర హీరో రవికృష్ణ.. 2011 తర్వాత సినిమాలకు దూరమయ్యారు. 12 ఏళ్లుగా ఈ హీరో ఎక్కడా పెద్దగా కనిపించలేదు. తాజాగా ఇలా కనిపించేసరికి అందరు షాక్ అవుతున్నారు.