మనిషి జీవనానికి’ఆహారం’ తీసుకోవడం ఎంతో ఆవశ్యకం.శరీర పెరుగుదలకు,కణజాలాల నిర్మాణానికి, జీవరసాయన ప్రక్రియలకు, ఆరోగ్యానికి, శక్తికి…ఇలా ఎన్నో రకాలుగా మనం తీసుకునే ఆహారం వినియోగమవుతుంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ అనుకూలతలు, ఇష్టాలు, స్తోమతలకు అనుగుణంగా వివిధ రకాల ఆహారంతో భోజనం చేస్తుంటారు. అయితే ఎవరు ఏం తిన్నా తప్పనిసరిగా కుడి చేత్తోనే తింటారు. ఎడమ చేత్తో ఎవరు తినరు. ఈ విధానం ఎప్పటి నుంచి ఆచరణలో ఉన్నా ‘కుడి చేత్తో తినడం’ వెనుక మాత్రం హిందూ సాప్రదాయంలో ఆయుర్వేద వైద్యం ప్రకారం కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. అవేమిటో తెలుసుకోండి.
హిందూ సాంప్రదాయం ప్రకారం కుడి చేతిలో పాజిటివ్ ఎనర్జీ (ధనాత్మక శక్తి) ఉంటుంది. కుడి చేత్తో భోజనం చేయడం వల్ల శరీరానికి, మనసుకు ఈ శక్తి అందుతుంది. కుడిచేతి వేళ్ల చివర లక్ష్మీదేవి ఉంటుందట. అదేవిధంగా వేళ్ల ఆధారం దగ్గర సరస్వతి, మధ్య భాగంలో వెంకటేశ్వర స్వామి ఉంటారని నమ్మకం. యజ్ఞ యాగాలు, దానాలు కూడా కుడి చేత్తోనే చేస్తారు. కుడి చేత్తో తినడమంటే సైతాన్ కు దూరంగా ఉండడమే అని కొన్ని మతాలకు చెందిన వారు విశ్వసిస్తారు.
కుడి చేత్తో తింటే జీర్ణప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇక ఎడమచేతిని వేరే అవసరాల కోసం వాడతాం కాబట్టి, తినడానికి ఉపయోగించడానికి సాదారణంగా అయిష్టత ఏర్పడుతుంది.