రాత్రి కాచిగుడ స్టేషన్ నుండి మా ఊరికి వెళుతున్నాను… రైల్లో కూర్చున్నాక ఒక పేద మహిళ వచ్చి బాబు ఒక్క రూపాయి ఉంటే ఇవ్వు అని అడిగింది. నేను మామూలుగా ఇలాంటి వారిని ఎవ్వరిని వాళ్ళ వివరాలు అడగకుండా వదిలిపెట్టను. ఆమెతో మాటలు కలిపి ఏంటి అమ్మ ఎక్కడ మీ ఊరు అని అడిగాను ? ఎందుకు ఇలా అడుక్కుంటున్నావ్?? అని అడిగితే తన కథ చెప్పుకుంటూ వచ్చింది.. తన పేరు మొగులమ్మ,తన ఊరు మహబూబ్‌నగర్ జిల్లా, ముగ్గురిని కన్న తల్లి, అందులో ఒక కొడుకు, కూతురు చనిపోయారు ఇంకా మిగిలింది చిన్న కూతురు ఒక్కతే.. ఆ బిడ్డ కోసం తన భర్త ఉన్న మూడు ఎకరాలు అమ్మి పెళ్లి చేసి గుండెపోటుతో చనిపోయాడు. ఉన్న తన అల్లుడు గుమ్మం కూడా ఎక్కనీయడు అంట.. కూతురు తన భర్తని ఎదిరించలేదు..
వాళ్ళ సంసారం పాడవుతుంది అని వాళ్ళ దగ్గరికి వెళ్ళదు అని చెప్పింది.. తన అల్లుడు మళ్లీ చేసేది సర్కార్ నౌకరి అంట… నెలకి 40 వేల జీతం.. మూడు ఎకరాల పొలం అమ్మి పెళ్లి చేసి లక్షల కట్నం తీసుకున్న అతనికి , తన అత్తకి ఒక ముద్ద పెట్టలేకపోవడం మానవత్వం, విలువలు పూర్తిగా దిగజారిపోయాయి అని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు..అసలు ఎలా అంత మనసు లేకుండా ఉంటారో.. ఆమెకు ఒక అన్న, తమ్ముడి పిల్లలు కూడా ఉన్నారు.. ఈమెను వాళ్ళు కూడా ఆదరించలేదు.. అమెది చాలా పెద్ద కుటుంబమే..కానీ ఒక్క ముద్ద పెట్టి ఇంత నీడ ఇచ్చే దిక్కు లేదు.. నాకు ఆదార్ కార్డ్ ఉంది..కొడుకా నాకు సర్కార్ ఇచ్చే పెన్షన్ ఇప్పించు..అని ఆమె చాలా దీనంగా అడిగే సరికి నాకు ఏమీ చెప్పాలో అర్ధం కాలేదు.. నేను ఒక పక్క Train లో కూర్చున్నాను కాసేపట్లో Train కూడా బయలుదేరుతుంది… నేను ఏమి చెయ్యలో కూడా ఎలా React అవ్వాలో కూడా అర్ధం కాలేదు..
ఇంత పెద్ద కుటుంబం ఉన్న నీకు ఒక్క ముద్ద పెట్టె ఇంత నీడ ఇచ్చే మనిషి లేడా అని అడిగితే ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు బిడ్డా అని ఎదురు ప్రశ్నించింది.. ఈమె హైదరాబాదులో ఒక దగ్గర చిన్న పాక(ప్లాస్టిక్ కవర్స్) వేసుకుంది అంట.. వారం కిందట తన చెల్లి చనిపోయింది అని తెలిస్తే మహబూబ్ నగర్ కి వెళ్ళింది అంట.. ఈ లోపు ఆ పాక వర్షాలకి లేచిపోయింది..నాశనం అయ్యింది అంట.. అందులో ఉన్న ఆమె చిన్న చిన్న వంట సామాన్లు తన వస్తువులు కూడా కొందరు కక్కుర్తి వెధవలు కొట్టేస్తే ఇలా రోడ్ మీదకి వచ్చి అడుక్కుంటున్నాను అని చెప్పింది.. ఇలా అడుక్కుంటూ మళ్ళి డబ్బు పోగేసి తన పాక వేసుకోవడానికి.. అన్ని చోట్లా తిరుగుతున్నాను ఏమి చెయ్యను కొడుకా అని చెప్పింది…
తాను చివరిగా అన్న మాట చాలా బాధ కలిగించింది.. బిడ్డా…మీ ఇంట్లో ఏదైన పని ఉంటే జీవితాతం చేస్తాను, ఇంత ముద్ద పెట్టి నీడ ఇస్తావా నేను చస్తే తీసేకేల్లి బొంద పెట్టు చాలు..అని అంది.. ఆమె మాటలు చాలా బాధించాయి.. నేను ధన సాయం చేశాను కానీ మనసులో ఏదో బాధ, అసంతృప్తి.. మనుషులు ఎందుకు ఇలా ఉంటారు అని ?? ఎంతమందో ఇలా ఎందుకు బ్రతుకున్నారు.. ఇంకొంచెం వివరాలు అడుగుదాం అనుకుంటే Train కదలడం… తాను దూరం అవ్వడం చక చకా జరిగిపోయాయి.