టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ 1985వ సంవత్సరం మే 5వ తేదీన జన్మించారు. పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. అనసూయ తండ్రి పేరు సుదర్శన్రావు కాగా ఆమె… భరద్వాజ్ ను పెళ్లి చేసుకుంది. హైదరాబాద్లోని బిజినెస్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది అనసూయ. చదువుకుంటున్న రోజుల నుంచి కూడా అనసూయకు మీడియాలో పని చేయాలని ఆసక్తి ఉండేదట.
అనసూయ మొదట వెండితెరపై ఎన్టీఆర్ నటించిన నాగ సినిమా లో కనిపించారు. ఆ తర్వాత సాక్షి టీవీలో న్యూస్ రీడర్గా పని చేశారు. నాగ సినిమాలో నటించినందుకు అనసూయకు 500 రూపాయల పారితోషికం ఇచ్చారట. అనసూయ మొదటగా యాంకర్ గా మారింది మాత్రం జబర్దస్త్ ప్రోగ్రాం తోనే కావడం విశేషం. ఆ తర్వాత ఆమె స్టార్ యాంకర్ గా ఎదిగింది.
ఈటీవీ, మా టీవీ, జీ టీవీ లో చాలా ప్రముఖ ఛానల్లో హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు అనసూయ భరద్వాజ్.