హైపోగ్లైసీమియా అనే దాన్నే హైపో అని కూడా వ్యవహరిస్తారు. అంటే బ్లడ్ లో షుగర్ తక్కువ స్ధాయిలో వుందని అర్ధం. ఈ పరిస్ధితి చాలా ప్రమాదకరమైంది. కనుక దీనిని గుర్తించడమెలాగో అవగాహన చోసుకోవాలి. హైపో వస్తే ఏం చేయాలి ? అది రాకుండా ఎలా చేసుకోవాలి? అనేది చూద్దాం. హైపో వచ్చిందనటానికి లక్షణాలు – బ్లడ్ షుగర్ స్ధాయి 50 ఎంజి లేదా అంతకంటే తక్కువకు పడుతుంది. చెమటలు, వణుకుడు, ఆకలి, గుండె వేగంగా కొట్టుకోవడం వుంటుంది. అందరికి ఈ చిహ్నాలు చూపకపోవచ్చు. వెంటనే ఈ పరిస్ధితి సరిచేసుకోకపోతే, ఆందోళనగాను తెలివి తప్పేదిగాను వుంటుంది. చివరకు కోమాలోకి దారితీస్తుంది.
హైపో వచ్చినపుడు ఏం చేయాలి? గ్లూకోమీటర్ దగ్గర వుంటే షుగర్ చెక్ చేయండి. ఇది సరి అయిన డయాగ్నసిస్ ఇస్తుంది. గ్లూకోమీటర్ లేకుంటే వెంటనే ఏదో ఒక ఆహారాన్ని తినండి. పరిస్ధితి వెంటనే మెరుగు పడితే, మీరు హైపో నుండి బయటపడ్డట్లే. హైపో వచ్చినపుడు ఏం తినాలి? పండ్లు, బిస్కట్లు, బ్రెడ్, శాండ్ విచ్, పాలు ఏదైనా తినవచ్చు. తీపి పదార్ధాలు వీలైనంతవరకు వాడకండి. అవి తింటే మరల షుగర్ పెరిగే ప్రమాదముంది. హైపో ను ఎలా సరిచేసుకోవచ్చు? హైపో సరి చేసుకున్న తర్వాత అసలు అది రావటానికి గల కారణం పరిశీలించండి. మరోమారు రాకుండా చూసుకోండి.
సాధారణంగా ఆహారం, ట్రీట్ మెంట్ రెండూ సరిపడకపోతే హైపో వస్తుంది. ఇన్సులిన్ తీసుకొని ఆహారం తీసుకోకపోతే వస్తుంది. డయాబెటీస్ బాగా కంట్రోల్ లో వుండి ఆహారం తీసుకోపోతే హైపో వస్తుంది. ఆహారం తక్కువ తీసుకుంటూ వ్యాయామం అధికంగా చేసినా షుగర్ స్ధాయి పడిపోతుంది. కిడ్నీ కనుక డయాబెటీస్ తో చెడినా లేక ధైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేయకపోయినా హైపో వస్తుంది. ఇటువంటపుడు డాక్టర్ ను సంప్రదించండి. హైపో కు ఇన్సులిన్ లేదా టాబ్లెట్ వేయవచ్చు. అయితే టాబ్లెట్ శరీరంలో సుమారు 48 గంటలు ప్రభావం చూపుతుంది.