పత్యం శతగుణం ప్రపోక్తం అని శాస్తోక్తం కనుక సర్వ వైద్యములకు పథ్యం చేయడం శ్రేయస్కరం. కొన్ని రకాల వ్యాధులు వచ్చినప్పుడు పథ్యం తప్పనిసరి అని డాక్టర్లు కూడా చెపుతారు . పథ్యమంటే తినతగినవి, అపథ్యం అంటే తినరానివి. ఎన్ని రకాల నియమాలు పాటించిన ఏదో విధంగా అనారోగ్యం బారిన పడ్తున్నాం.. కాబట్టి మన ఆరోగ్యానికి మేలు చేసే పధ్యం పాటించడంలో తప్పులేదు…పధ్యం చేసేప్పుడు తినకూడనివి,తినేవి ఏంటో తెలుసుకోండి.
బీరకాయ, పొట్లకాయ, బీట్రూట్, అరటికాయ, దొండకాయ, తోటకూర, మెంతికూర, పొన్నగంటికూర, దోసకాయ, ఆనపకాయ, పొట్టుపెసరపప్పు, మినపప్పు, కందిపప్పు, కేరట్, అరటిపువ్వుకూర తినదగిన కూరలు.
అపథ్యమంటే తినకూడనవి… గొఱ్ఱె మాంసం, కొబ్బరికాయ, వంకాయ, గోంగూర, చేపలు పచ్చివి, ఎండువి, పీతలు ఆవకాయ, గుమ్మడికాయ, కొత్తచింతకాయ, శనగపప్పు, ఆనుమలపప్పు తినకూడదు. పచ్చళ్లు చాలామందికి ఇష్టం..కొంతమంది ఎటువంటి కూరలు లేకపోయినా పచ్చళ్లతోనే సరిపెట్టేసుకుంటారు..కానీ పధ్యం అనేది పచ్చళ్‌లకు కూడా వర్తిస్తుంది.. అవేంటో తెలుసుకోండి…
తినతగిన పచ్చళ్లు.. నిమ్మకాయ, మాగాయ పచ్చడి, కరివేపాకు, కొత్తిమీర పచ్చడి, అల్లపు పచ్చడి తినవచ్చు.
తినకూడని పచ్చళ్లు… వాతరోగులు, ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, కొత్తచింతకాయ, ఉసిరికాయ పచ్చడి తినకూడదు. రాత్రిపూట నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి తినకూడదు. రాత్రిపూట వాతమధికముగా ఉంటుంది కాబట్టి… నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్లు తింటే తలలోని సూక్ష్మాతి సూక్ష్మనాడులు పగిలిపోవటం వల్ల పక్షవాతం రోగము రావచ్చు.