గతంలో భర్తలను భార్యలు ఎవండీ, బావగారూ,, జీ, హజీ, అని పిలిచేవారు. పాశ్చాత్య సంస్కృతి కారణంగా…గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు అరేయ్, ఒరేయ్ అని…భర్త పేరును పెట్టి పిలుస్తున్నారు. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం ఇది తప్పట.! భర్తలను భార్యలు పేరుపెట్టి పిలవకూడదట. ఇలా చేయడం అమర్యాదకరమట, అంతే కాదు నలుగురిలో భర్త విలువను తగ్గించినట్టేనట.!
ఆ మాటకొస్తే…మనకన్నా పెద్దవాళ్ళను పేరుపెట్టి పిలవడమే తప్పు, అలాంటిది…..భార్యకు అన్ని విధాలుగా రక్షణగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తను పేరుపెట్టి పిలవడం ముమ్మాటికీ తప్పే అంటున్నాయి మన సాంప్రదాయాలు. ఏకాంత సమయంలో భర్తను ఎలా పిలిచినా తప్పులేనప్పటికీ….ఇంట్లో వాళ్ల ముందు, పిల్లల ముందు, బయటి వాళ్ళ ముందు మాత్రం పేరు పెట్టి పిలవకూడదట, ఇలా చేయడం వల్ల ..వారిలో మీ భర్త గౌరవం తగ్గడమే కాక, మీ గౌరవమూ తగ్గుతుందట.!
గతంలో…అయితే తల్లి పేరును కలుపుతూ పిలిచే వారు. ఉదాహరణకు గౌతమీ పుత్ర, జిజియా పుత్ర అని పిలిచే వారు, ఇప్పుడు తల్లి పేరుతో కలిపి పిలవడం ఆచరణ అసాద్యం కాబట్టి….ఎవండీ అనే అనురాగ మాధుర్యంతో, బావగారు అనే అత్మీయత తో పిలిస్తే మంచిదట.
ముందుగా ఓ సారి….భార్య భర్త కూర్చొని చర్చించిన తర్వాతే అలా పిలుచుకోవడం స్టార్ట్ చేయండి. అత్తామామలు తమ కొడుకును పేరు పెట్టి పిలవడం ఇష్టపడరు..కాబట్టి వారిని కూడా కన్విన్స్ చేశాకే…భర్తలను పేరు పెట్టి పిలవండి.