శృంగారం అనేది ఈ సృష్టిలో ఒక భాగం. ఇది దేవుని పవిత్ర కార్యం. పురుషుడి శృంగార కాంక్ష సూర్యుడిలా ప్రఖరంగా ఉంటుంది. కానీ స్త్రీ శృంగారకాంక్ష చంద్రుడి వెన్నెలలా చల్లగా ఉంటుంది . పురుషుడు శారీరిక కలయికకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు. కానీ స్త్రీ శృంగారంలో చిన్న చిన్న అనుభూతులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది.
ప్రియుడుతో వెన్నెలలో విహరించడం, తలలో పూలు తురిమితే సంతోషపడడం ఇటువంటివి కూడా స్త్రీకి మంచి శృంగారానుభూతిని కలిగిస్తాయి. పురుషుడికి మంచి వంట చేసి పెట్టడం కూడా శృంగారంలో ఒక భాగమే. పురుషుడు ఒక చీర కొనివ్వడం కూడా స్త్రీకి మంచి అనుభూతిని కలిగిస్తుంది .
పురుషుడికి శృంగారకాంక్ష పరవళ్ళు తొక్కే సెలయేరులా ఉధృతంగా ఉంటుంది .స్త్రీకి శృంగారాకాంక్ష శాంతంగా ప్రవహించే నదిలా ఉంటుంది. స్త్రీ కి ముఖ్యమైనది శారీరిక సంతృప్తి ఒక్కటే కాదు .మానసిక సంతృప్తి కూడా .ప్రియునితో గడిపిన క్వాలిటీ టైం స్త్రీకి ముఖ్యం .ఒక్క మాటలో చెప్పాలంటే శృంగారం అనేది పురుషుడికి ఒక అనుభవం కానీ స్త్రీ కు అది ఒక అందమైన అనుభూతి.