బుల్లితెర మీద ప్రసారమయ్యే కామెడీ షోలలో ది బెస్ట్ అనగానే టక్కున గుర్తొచ్చేది జబర్దస్త్. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమందిని నవ్విస్తూ, ఎంతోమందికి జీవితాన్నిచ్చిన ఈ జబర్దస్త్ టాలీవుడ్ లో అన్ని కామెడీ షోలకంటే ఎక్కువ ప్రజాదరణ పొందింది. ప్రతి గురు, శుక్ర వారాలలో 9:30కు ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో ఎంతోమంది కమెడియన్లు తమ కామెడీ ద్వారా ప్రజలను కడుపుబ్బ నవ్విస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం జబర్దస్త్ కి జడ్జీలుగా వ్యవహరించిన వారి రెమ్యూనరేషన్ ఇవేనంటూ కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. మరి ఒక్కో ఎపిసోడ్ కి జబర్దస్త్ జడ్జిల రెమ్యూనరేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. రోజా: టాలీవుడ్ హీరోయిన్ గా రోజాకు భారీ ఫేమ్ ఉన్న సంగతి తెలిసిందే. ఒక్కో ఎపిసోడ్ రూ. 5లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. ఇక మంత్రి అయ్యాక జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేశారు. కానీ ఇప్పుడు వారి పార్టీ అధికారంలోకి రాలేదు.
నాగబాబు: టాలీవుడ్ లో నటుడిగా క్రేజ్ ఉన్న నాగబాబు, జబర్దస్త్ కు జడ్జిగా ఎపిసోడ్ కు రూ. 3లక్షలు మాత్రమే తీసుకున్నారట. ఇంద్రజ: హీరోయిన్ గా క్రేజ్ ఉన్న ఇంద్రజ జబర్దస్త్ లో జడ్జిగా కొనసాగారు. ఇంద్రజ ఒక్కో ఎపిసోడ్ కు రూ. 2.50లక్షలు పారితోషకంగా తీసుకున్నారని సమాచారం. కృష్ణ భగవాన్: టాలీవుడ్ కమెడియన్ గా కృష్ణ భగవాన్ కి మంచి గుర్తింపు ఉంది.జబర్దస్త్ కి జడ్జిగా వచ్చిన భగవాన్ కి ఎపిసోడ్ కు రూ. 2.50లక్షల పారితోషకం ఇచ్చినట్లు సమాచారం.