నా వయస్సు 32 ఏళ్లు. కానీ నన్ను చూస్తే చాలా మంది నా వయస్సు 20 ఏళ్లని అనుకుంటారు. నేను చాలా కచ్చితమైన డైట్, వ్యాయామం, ఆహార ప్రణాళికను పాటిస్తాను. నేను ఇంత యంగ్‌గా కనిపించేందుకు కారణం నేను పాటిస్తున్న జీవనశైలి. నేను ఇప్పటికీ ఖాళీ దొరికితే తరచూ 5 కిలోమీటర్లు వాకింగ్ చేస్తాను. రోజుకు కచ్చితంగా 8 నుంచి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకుంటాను. వేసవిలో 3 లీటర్లు, ఇతర సీజన్లలో రోజుకు కచ్చితంగా 2 లీటర్ల నీళ్లను తాగుతాను. సూప్‌లు, జ్యూస్‌లు, పప్పు, గ్రీన్ టీకి అధిక ప్రాధాన్యతను ఇస్తాను.
గత 4 ఏళ్ల నుంచి ప్రతి రోజు 15 నిమిషాల పాటు స్ట్రెచింగ్ తరహా వ్యాయామాలు చేస్తాను. పీరియడ్స్ ఉన్న సమయంలో వ్యాయామం చేయను. ఏరోజుకారోజు నాకు వచ్చే ఆలోచనలను అన్నింటినీ నేను పుస్తకంలో రాసుకుంటా. దీంతో నేను నా ఒత్తిడిని జయించ గలుగుతున్నా. నేను గత 4 ఏళ్ల నుంచి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నా. ఉదయం 9-10 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 2-3 గంటలకు టీ ఇంకా పండ్లు లేదా నట్స్, సాయంత్రం 6 లోపు డిన్నర్ ముగించేస్తా. సాయంత్రం 6 దాటితే ఎట్టి పరిస్థితిలోనూ ఆహారం తీసుకోను.
రోజూ నా పనులు అన్నింటినీ నేనే చేసుకుంటాం. ఇంట్లో ఎలాంటి పని మనుషులు కూడా లేరు. నా బాబుకి అన్నీ రెడీ చేసి దగ్గరుండి స్కూల్‌కు పంపిస్తా. కామెడీ మూవీలు అంటే నాకు చాలా ఇష్టం. సృష్టిలోని ఏ వస్తువు లేదా మనిషిపై కూడా మరీ అతిగా ప్రేమను పెట్టుకోకూడదు. వారికి ఏమైనా అయితే తరువాత ఉండే బాధను వర్ణించలేము. కనుకనే డిటాచ్‌మెంట్ ను కలిగి ఉంటున్నా.