కొన్ని గంటలు సూర్యుడు ఉంటె, మరి కొన్ని గంటలు చంద్రుడు ఉంటాడు, అమావాస్య నాడు తప్ప మిగిలిన అన్ని రోజులు చంద్రుడు ఉంటాడు, కానీ ఆ ఊర్లల్లో చంద్రుడు ఉన్నా, సూరీడు దెబ్బకి అస్సలు కనిపించడు, అసలు సూర్యుడు కనుమరుగైతేగా చంద్రుడు ప్రకాశించడానికి. 24 గంటలు సూర్యుడు ఆ ఊరిని వెంటాడుతూనే ఉంటాడు, ప్రతి రోజు కాదండోయ్, కేవలం కొన్ని నెలలే. వివరాల్లోకెళితే.. నార్వే దేశం లోని లాంగియర్‌బెన్ అనే ఊళ్ళో నాలుగు నెలల పాటు సూర్యుడు 24 గంటలు ప్రకాశిస్తూనే ఉంటాడు. మే నుంచి ఆగస్టు దాకా ఇరవై నాలుగ్గంటలూ సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. అసలు ఆ నాలుగు నెలలూ పగటికి రాత్రికి తేడానే ఉండదు. సూర్యుడు ప్రకాశానికి చీకటి అనే మాటే ఉండదు ఆ నాలుగు నెలలు, కానీ ఆ తరువాత చీకటే చీకటి.
లాంగియర్‌బెన్ గ్రామంలో నాలుగు నెలల పాటు చిమ్మ చీకటి ఉంటుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా మొత్తం చీకటే, సూర్యుడి జాడ ఈ నాలుగు నెలలు కనిపించదు, చీకట్లోనే ఈ 4 నెలలు సావాసం చెయ్యాలి. ఇలా నాలుగు నెలలు వెలుగుని, నాలుగు నెలలు చీకటిని చూస్తూ వస్తున్నారు లాంగియర్‌బెన్ గ్రామంలోని ప్రజలు.
నార్వే లో అక్కడొక్కటే కాదు, ఫిన్లాండ్ దేశం లో కూడా కొన్ని ఏరియా లలో 24 గంటలు సూరీడు ఉంటాడు, కానీ లాంగియర్‌బెన్‌లో మాత్రమే ఎక్కువ నెలలు నివాసం ఉంటాడు. వలయాకారంలో ఉన్న భూమికి ఉత్తర దిక్కున చిట్టచివరన ఉండే ప్రాంతం లాంగియర్‌బెన్. అయితే సూరీడు రాత్రి పూట ఉన్నప్పుడు అద్భుతమైన చిత్రాలు తీసుకోవచ్చు, మాటల్లో వర్ణించలేనంత అమోఘమైన చిత్రాలు మీ కెమెరా లో బంధించవచ్చు.