పురుషులు మహిళ పక్కన వున్నా? లేక తాను మహిళ గురించి ఆలోచిస్తూ వున్నా….మానసికంగా తాను తక్కువని భావిస్తాడని ఒక తాజా రీసెర్చి చెపుతోంది. మహిళ ఎదురుపడితే చాలు…పురుషులకు ఏం చేయాలో తెలియని స్ధితి. తిన్నగా ఆలోచంచలేరు అని పరిశోధకులు తెలిపినట్లు న్యూయార్క్ డైలీ న్యూస్ తెలిపింది.
అయితే, మహిళలలో ఈ రకమైన పరిస్ధితి లేదని కూడా నెదర్లాండ్స్ లోని రాడ్ బౌడ్ యూనివర్శిటి నిజమేజన్ తెలిపారు. మహిళకు ఏదైనా ఒక విషయం చెప్పాలంటే, పురుషులు ఎంతో నెర్వస్ గా భావిస్తారని, ఆ సమయంలో తన ఆప్త మిత్రుడు అటుపోతున్నా అతనిని కూడా గుర్తించని స్ధితిలో వుంటారని వారు తెలిపారు.
దీనికి కారణం, మహిళ ఆకర్షణీయంగా వుండటం, పురుషుడు ఆమెను మెప్పించటానికి చూడటం అంటారు. మరి మహిళలు వారినే గమనిస్తున్నారంటే…వీరు మరింత మానసిక శక్తిని కోల్పోతారు. కాని ఈ స్ధితి మహిళలలో కనపడదట.