ఆఫీసు వాతావరణం అంటే అంతే.. ఉద్యోగులకు ఎవరికైనా ఆఫీసులో కాస్త బెరుకుగానే ఉంటుంది. కొత్త అయితే అది మరీ ఎక్కువగా ఉంటుంది. ఆఫీసు పాత అయ్యేకొద్దీ దాని వాతావరణానికి ఎవరైనా అలవాటు పడుతారు. ఈ క్రమంలోనే అనేక మంది కొత్త స్నేహితులు కలుస్తారు. వారిలో కొందరితో మాత్రమే చనువు ఏర్పడుతుంది. ఇక వారు లేడీ కొలీగ్స్ అయితే ఆ చనువు మరింత పెరిగితే అది వివాహేతర సంబంధానికి దారి తీస్తుంది. ఆఫీసుల్లో ఇలాంటివి కామనే అయినప్పటికీ నిజానికి ఇలాంటి సంబంధాల వల్ల ఉద్యోగులకు నష్టమే జరుగుతుంది. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆఫీసుల్లో లేడీస్ లేదా జెంట్స్ ఎవరైనా తమ కొలీగ్స్‌తో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అది అంత మంచిది కాదు. దాంతో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయంటే… ఆఫీస్‌లో ఆడ, మగ కొలీగ్స్ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడితే ఇక వారు రోజూ ఏదో ఒక గిల్టీ ఫీలింగ్‌తో ఉంటారు. తమ లైఫ్ పార్ట్‌నర్‌ను మోసం చేస్తున్నామని అనుకుంటూ ఆందోళనకు లోనవుతుంటారు. ఆఫీస్‌లో ఆడ, మగ ఇద్దరు కొలీగ్స్ మధ్య అలాంటి సంబంధం ఏర్పడితే, ఆ సంబంధం ఇతర కొలీగ్స్ కు తెలిస్తే వారు ఇక ఆ విషయాన్ని ప్రచారం చేస్తారు. వెనుకగా దాని గురించి మాట్లాడుకుంటారు. అలాంటి సంబంధం పెట్టుకున్న వారిని తక్కువ చేసి చూస్తూ ఉంటారు.
ఉద్యోగులు ఎవరైనా తమ కొలీగ్స్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఇక వారు ఆఫీస్‌లో సరిగ్గా పనిచేయలేరు. అది వారి పనితనంపై ప్రభావం చూపుతుంది. దీంతో సరైన సమయానికి ప్రమోషన్లు రాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో జాబ్ పోయేందుకు అవకాశం ఉంటుంది కూడా. అలాంటి సంబంధాల గురించి తెలిసిన ఇతర వ్యక్తులు లేదా సంబంధంలోనే ఉన్నవారు ఎదుటి వారిని బ్లాక్ మెయిల్, మోసం చేయవచ్చు. ఇద్దరు ఉద్యోగుల మధ్య ఏర్పడే అలాంటి సంబంధాలను అనువుగా తీసుకుని ఉన్నత స్థాయి సిబ్బంది వారికి వచ్చే ప్రమోషన్లు, ఆఫర్లను కొట్టేయవచ్చు. కనుక ఎలా చూసినా ఇలాంటి సంబంధాలు మంచివి కావు. కాబట్టి సేఫ్‌గా మన దారిన మనం పనిచేసుకుంటే బెటర్. ఏమంటారు..!