ఎన్టీఆర్ ఆ పేరు తలవగానే తెలుగు నేల పులకిస్తుంది. ఆరుపదుల వయసులో రాజకీయ పార్టీని స్థాపించి, అధికారంలోకి రావడమే విశేషమైతే, ఏడున్నర ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఎన్టీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయము ఓ అసాధారణ సంస్కరణ. రాజకీయాన్ని సామాన్యుడి చెంతకు చేర్చిన ప్రజా నాయకుడయన. రాజకీయాలంటే వ్యాపారం కాదని పేదల అభ్యున్నతి, సంక్షేమమే పరమావధి అని చాటిన అభ్యుదయవాది.
ఆడపిల్లలకు ఆస్తిలో సగం వాటా ఇచ్చిన, పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం పంచిన, సగం ధరకే జనతా వస్త్రాలు అందించిన, పక్కా ఇల్లు కట్టించిన, వెనుకబడిన వర్గాలకు విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రాజకీయాల్లోనూ ఉన్నత స్థానాలు కల్పించిన ఆయనకు ఆయనే సాటి. అయితే, ఎన్టీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు జనాలని హోటల్ వాళ్ళు దోచుకుంటున్నారని ఎన్టీఆర్ గారు అభిప్రాయపడ్డారు అంట. ఇక ఒక మంచి ఐడియా వచ్చింది.
అప్పుడు ఆయన ఏం చేశారంటే హోటల్స్ కి కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆకలి వేసి హోటల్ కి వెళ్లి టిఫిన్ తిందాం అనుకొని వెళ్తే హోటల్ వాళ్ళు బాగా దోచేస్తున్నారు. అందుకే హోటల్లో ఏఏ ఆహార పదార్థాలను ఎంతకీ అమ్మాలి అని ఆయన నిర్ణయించారు. పైగా ఒక జీవోని కూడా పాస్ చేశారు అంట. ఇక ఆ జీవోలో ఉన్న విషయాలను చూద్దాం. హోటల్ వాళ్ళు ప్లేటు ఇడ్లీ 10 పైసలు కన్నా ఎక్కువ అమ్మకూడదు అని చెప్పారు. దోస అయితే 15 పైసలు, పూరి అయితే 15 పైసలు, మసాలా దోశ అయితే 20 పైసలు మాత్రమే ఉండాలని ఎన్టీఆర్ కండిషన్ పెట్టారు. భోజనం విషయానికి వస్తే ఫుల్ మెయిల్స్ రూపాయి, ప్లేట్ మీల్స్ అర్ధరూపాయి ఉండాలని ఆ జీవోలో ఉంది.