డయాబెటిక్ రెటినోపతీ అనేది షుగర్ వ్యాధి (డయాబెటీస్) కారణంగా కంటి రెటినాకు ఏర్పడే సమస్య . రెటీనా కాంతిని గ్రహించి మెదడుకు సిగ్నల్స్ పంపుతుంది. రక్తంలో అధిక రచక్కెర స్థాయిలు రెటినాలోని రక్త నాళాలను దెబ్బతీస్తే ఈ స్థితి ఏర్పడుతుంది. డయాబెటీస్ ని సరిగ్గా నియంత్రించకపోవడం, డయాబెటీస్ 10 సంవత్సరాలకు పైగా ఉండడం, అధిక రక్తపోటు లేదా కొలెస్ట్రాల్ ఉండడం, గర్భిణిలో జెస్టేషనల్ డయాబెటీస్ రావడం వంటి కారణాల వల్ల డయాబెటిక్ రెటినోపతి వస్తుంది.
డయాబెటిక్ రెటినోపతి వస్తే కళ్లు మసకబారిన చూపుతో కనిపిస్తాయి. రంగులను గుర్తించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. మచ్చలు లేక చుక్కలు కనిపించడం. రాత్రిపూట చూపులో ఇబ్బంది ఏర్పడుతుంది. దృష్టి పూర్తిగా కోల్పోవడం (తీవ్రమైన దశల్లో) జరుగుతుంది. డయాబెటిక్ రెటినోపతి రాకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది.
షుగర్, BPను నియంత్రించండి. డయాబెటీస్ ఉన్నవారు సంవత్సరానికి ఒకసారి కంటి డాక్టర్ను కలిసి, రెటినా స్క్రీనింగ్ చేయించుకోవాలి. చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించి, ఫైబర్, ఆంటీఆక్సిడెంట్లు ఎక్కువగా తీసుకోవాలి. ధూమపానం మానేయాలి. డయాబెటిక్ రెటినోపతీ ప్రారంభ దశలలో లక్షణాలు కనిపించకపోవచ్చు . కాబట్టి, డయాబెటీస్ ఉన్నవారు తప్పనిసరిగా సాధారణ కంటి తనిఖీలు చేయించుకోవాలి. దృష్టి కోల్పోకుండా ఆరంభంలో గుర్తించడమే ఉత్తమ మార్గం.