అతడు దాదాపు 10 ఏళ్ల పాటు అమెరికాలోని టాప్ టెక్ కంపెనీల్లో పని చేశాడు. కానీ గతేడాది జరిగిన లేఆఫ్స్‌లో అతడు ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ఆ తరువాత హెచ్-1బీ వీసా గడువు ముగియడం, గ్రీన్ కార్డు అప్లికేషన్‌ను కూడా అతడు పనిచేస్తున్న సంస్థ ఉపసంహరించుకోవడంతో అతడికి అమెరికాను వీడక తప్పలేదు. అయితే, స్వదేశానికి తిరిగి వస్తున్నందుకు అతడు ఎంతగానో సంతోషించాడు. కానీ ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులకే అతడి ఆనందం కాస్తా ఆవిరైపోయింది. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడలేక అతడు నరకం చూశాడు. భారత్‌లో ప్రశాంతంగా ఉండదగిన పరిస్థితులు లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఢిల్లీలో పాటు ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. ఎక్కడ చూసినా కూడా మౌలిక వసతుల లేమి కొట్టొచ్చినట్టు కనిపించిందని అన్నాడు. వాయు కాలుష్యం, ప్రజల్లో పౌర స్పృహ కొరవడటం వంటివి తనను బాగా ఇబ్బంది పెట్టాయని అన్నారు. ఇండియాలో బతకలేమనిపించే భావనకు పలు కారణాలు తెలిపాడు. గోతుల మయమైన రోడ్లు, ఇష్టారీతిన డ్రైవింగ్ చేసే వాహనదారులు, బహిరంగ మలమూత్ర విసర్జనలు వంటి వన్నీ సామాన్యులకు నిత్య నరకం చూపిస్తాయని చెప్పుకొచ్చాడు.
కాగా, అతడి పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది సదరు టెకీ పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉన్న అతడికి దుబాయ్, సింగపూర్ లాంటి దేశాల్లో మంచి అవకాశాలు లభిస్తాయని సూచించారు. ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు ట్రై చేయమని కొందరు అన్నారు. యూరప్‌లో శాలరీలు తక్కువగా ఉన్నా కూడా జీవన ప్రమాణాలు బాగుంటాయని కొందరు తెలిపారు. మరికొందరు మాత్రం మరికొంత కాలం ఆగితే టెకీ ఇండియాలోని పరిస్థితులకు అలవాటు పడిపోతారని తెలిపారు. భారత్‌కు సంబంధించి ఇదో విషాదకర వాస్తవమని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.