భోజనం చేసే క్రమాన్ని మన పెద్దలు ఎప్పుడో నిర్ణయించారు. దీని వెనుక శాస్త్రీయత కూడా దాగి ఉంది. తిన్న పదార్థం 20–30% అరగటం అనేది నోటిలో జరుగుతుంది. దీనికి పళ్ళు మరియు లాలా జలం సహకరిస్తాయి. మిగిలిన 70% పొట్టలో జరుగుతుంది. కేవలం సోషణ మాత్రమే మన ప్రేగులలో జరుగుతుంది. ఐతే మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే పొట్టలో కొన్ని ఎంజైమ్స్ మరియు ఉదజనికామ్లము ముఖ్యపా త్ర పోషిస్తాయి. వీటికి లాలాజలం కూడా తోడైతే త్వరగా జీర్ణం అవుతుంది. లాలా జలం క్షార స్వభావం కలిగి ఉంటుంది. ఇది కడుపులో ఉండే మిగిలిపోయిన ఉదజనికామ్లాన్ని తటస్తీకరిస్తుంది. అందుకే ఎప్పుడూ కొంచెం కొంచెం గా నీరు తాగాలి అనేది. దీనివలన లాలా జలం ఊరుతూ వుంటుంది.
ఐతే భోజనం చేసేపడ్డతిలో మొదట స్వీట్ లేక ఏదైనా తీపి పదార్థం అంటే పరమాన్నం తో మొదలు పెట్టాలి. సహజంగా తీపి పదార్థం మనకు నోటిలో లాలాజలాన్ని ఊరిస్తుంది. కాబట్టి జీర్ణ క్రియ వేగవంతం అవుతుంది. భోజనం చేసే క్రమం ఇలా.. మొదట తీపి పదార్థం తినాలి. త్వరగా జీర్ణం అయ్యేవి పండ్లు కూరగాయలు, సులభంగా జీర్ణం అయ్యేవి అంటే వరి అన్నం, కొంచెం సమయం తీసుకునేవి అంటే గోధుమతో చేసిన రొట్టె, మిల్లెట్ అన్నం మున్నగునవి.. ఈ క్రమంలోనే మన పెద్దలు భోజనం వడ్డించేవారు. ఒకవేళ కావాలి అంటే వేడి నీరు లేదా టీ ఒక అరగంట తరువాత తాగాలి. పైన చెప్పిన దానికి విరుద్ధం అంటే వెనుక క్రమం లో మనం ఆరగిస్తున్నాం. అందుకే గోధుమపిండి తో చేసిన రోటీ లేక రొట్టె మనం చివరలో తింటే అందరూ విచిత్రం గా చూస్తారు. అసలు గోధుమ, వరి అన్నం కలిపితినటం మనకు ఇదవరకు తెలియదు. తృణధాన్యాలు అలాగే గోధుమలు తినవచ్చు. వరిని మనకు దగ్గర చేసింది ఆంగ్లేయులు.
ఎందుకు ఇలా: కూరగాయలు పళ్ళు 20–40 నిమిషాలు, వరి అన్నం 1–2 గంటలలో, గోధుమ : 2–3 గంటలలో, మాంసాహారలలో కోడి : 6 గంటలు, మేక : 15-20 గంటలు పడుతుంది అరగటానికి. ఇంకొక విషయం మైదా 20–25 గంటలు పడుతుంది. కాబట్టి ఎక్కువ సమయం పట్టేవి ముందు తింటే మన జీర్ణక్రియ మందగిస్తుంది అంటే తిన్నా కానీ శరీరం శక్తిని వెంటనే పొందలేదు. అలాగే తిన్నవెంటనే ఐక్రీం తిన్నచో దాని చల్ల దానానికి కూడా జీర్ణ క్రియ వేగం మందగిస్తుంది. అలాగే ఆహారం లోని నూనె లేక నెయ్యి పేరుకుపోతుంది. దీనికి వేడి లేక సమయం కావాలి. సహజంగానే క్రొవ్వులు ఎక్కువసమయం తీసుకుంటాయి. వేడినీరు లేక తేనీరు ఇందుకు సహకరిస్తుంది. మీకు కావలసిన విషయం స్వీట్ ఆఖరులో తింటే మంచిదా ? లేదు మొదటనే తినాలి.