టాలీవుడ్ ప్రేక్షకులకు అంజలా జవేరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ప్రేమించుకుందాం రా అనే సినిమాలో విక్టరీ వెంకటేష్ తో జోడి కట్టి తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకుంది. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో చూడాలని ఉంది బాలకృష్ణతో సమరసింహారెడ్డి, నాగార్జునతో రావోయి చందమామ, సినిమాలో నటించింది. ఈ విధంగా తెలుగు స్టార్ హీరోలు అందరితో ఈ అమ్మడు తెరను పంచుకొని తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తన అందాలతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది.
ఇంతలా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న అంజలా జవేరి వివాహం తర్వాత సినిమాలకు దూరమైంది. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఆమె భర్త కూడా మనందరికీ తెలిసిన టాలీవుడ్ నటుడే. అతడు కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని చాలామందికి తెలియదు. అతను ఎవరో కాదు బాలీవుడ్ నటుడు తరుణ్ రాజు ఆరోరా.. హిమాలయపుత్ర అనే బాలీవుడ్ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది అంజలా.. దీని తర్వాత ప్రేమించుకుందాం రా సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది ఈ బ్యూటీ. వ్యక్తిగత జీవితానికి వస్తే.. కెరియర్ పీక్ స్టేజిలో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పి వివాహం చేసుకుంది..
తన భర్త తరుణ్ రాజు అరోరా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో అతడినే వివాహమాడింది. తరుణ్ అరోరా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో మోడ్రన్ విలన్ గా పరిచయమయ్యారు. ఈ చిత్రంలో తనదైన విలనిజంతో ప్రేక్షకులు ఆకట్టుకున్నారని చెప్పవచ్చు. ఆ తర్వాత కాటమరాయుడు, అర్జున్ సురవరం, జయ జానకి నాయక వంటి సినిమాల్లో విలన్ గా నటించాడు. తరుణ్ అరోరా అంజలా జవేరి కంటే ఏడేళ్ల చిన్నవాడు. అయినప్పటికీ వీరి మనసులు కలవడంతో కొన్నాళ్లపాటు డేటింగ్ చేసి చివరికి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లయి ఇన్ని సంవత్సరాలైనా వారికి పిల్లలు లేరని అంజల చెబుతోంది. ఆమెకు తగ్గ పాత్ర వస్తే ఓకే చెబుతానని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.