యాంకర్ సుమ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయినా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింపచేస్తూ ఆకట్టుకుంటారు. సుమా జన్మతః మలయాలి. అయినా తెలుగింటి కోడలై మాటలతో మైమరపిస్తున్నారు. యాంకర్ సుమ తనదైన మేనరిజంతో ఎంతో పేరు తెచ్చుకున్నారు.
టీవీల్లో కూడా సుమా తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ అప్పటికప్పుడు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ అంత పేరు తెచ్చుకున్నారు. ఇటీవల సుమ జయమ్మ పంచాయతీ సినిమాతో నటిగా రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేదు. కానీ సుమ నటనతో మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే సుమ యాక్టర్ రాజీవ్ కనకాల భార్య అన్న సంగతి అందరికీ తెలిసినదే. అయితే రాజీవ్ కనకాల కంటే సుమనే బిజీ అని చెప్పుకోవాలి. ఇక ఇక్కడ వీరి కలల సౌధాన్ని గురించి మాట్లాడుకోవాలి.
ఆ ఇల్లు ఎంత బాగుందంటే, టాప్ మోస్ట్ తెలుగు సినిమాలు అన్ని ఆ ఇంట్లోనే షూటింగ్ జరుపుకున్నాయని అతి కొద్ది మందికి తెలుసు. సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా, తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన 100% లవ్ సినిమా షూటింగ్ మొత్తం సుమ ఇంట్లోనే జరిగింది. అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన బాద్ షా సినిమాలో కాజల్ అగర్వాల్ ఇల్లు ఎవరిదనుకుంటున్నారు? మన సుమక్కదే. అలాగే మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలో ఇల్లు కూడా ఆమెదే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు పెద్దగానే ఉంటుంది. సునీల్ పూలరంగడు, రామ్ చరణ్ బ్రూస్ లీ ఇంకా అనేక సినిమాలకు సుమా కనకాల ఇల్లు వేదికగా మారడం విశేషం.