రుచికరమైన సముద్ర చేపలు, మంచినీటి చేపలను ఆహారంగా తినాలి. మురికి నీటిలో, పాదరసం, ఆర్సెనిక్ compounds తో కలుషితమైన నీటిలో పెరిగే చేపలను తినరాదు. చేప మాంసంలో Omega 3 fatty acids వుంటాయి. అలాంటి చేపలను తినాలి. ఇవి గుండెకు, చర్మానికి, కంటికి మంచివి. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కలిగిన తిలాపియా (గురక) లను తింటే గుండెకు వాపు వచ్చే అవకాశం ఉంది కనక తినరాదు.
చేప నూనె గుండెకు మంచిది.అన్ని వయసుల వారు చేపను తినవచ్చు. చేప మాంసం త్వరగా జీర్ణమవుతుంది. తక్కువ ముళ్ళు వున్న చేపలను తినాలి.అయితే కొన్ని చేపలు ఎక్కువ ముళ్ళు కలిగివున్నా మంచి రుచిగా వుంటాయి. బొచ్చెలు, జెల్లలు, ఇసుక దొందులు, సొర చేప, బొమ్మిడాయిలు, బురద మట్టలు, వాలుగ, చందమామలు, కోరమేను, పులస చేప, tuna, salmon, ఈల్, రోహు, సీలావతి, రూప్ చంద్, పాంప్రేట్( appollo fish), cod fish , మెకెరల్ మొదలగు చేపలు మంచివి.
చేపను రోజూ తినొచ్చు. ఆరోగ్యంగా, ఎక్కువ కాలం యవ్వనంగా వుంచుతుంది. మాంసాహార చేపలు ex: మార్పులు (ఇంగ్లీకాలు) తినవద్దు. పీతలు, రొయ్యలు చేపలు కావు.