చిన్నతనంలోనే షుగర్ వ్యాధికి గురవటం చాలా దురృష్టకరం. అయితే, స్కూలుకు వెళ్ళే పిల్లలు వారంతట వారు షుగర్ వ్యాధి రీడింగ్ తీసుకునేలా ఒక గ్లూకో మీటర్ ను వుంచుకోవడం సమర్ధవంతమైన నిర్వహణకు మంచిది. ఒక వేళ ప్రాణాంతకమైన హైపోగ్లసేమియా (లో షుగర్) ఏర్పడితే వేంటనే తగు చర్యలు చేపట్టవచ్చు. బాల్యంలో వచ్చే షుగర్ వ్యాధికి ఈ మాత్రం నియంత్రణ అత్యవసరం. అయితే, పిల్లలకు షుగర్ వ్యాధి వుందని భయంతో స్కూలు మాన్పించాల్సిన అవసరం లేదు. వారిని సాధారణ పిల్లలుగానే పరిగణించాలి. కాని ఆహారం, స్నాక్స్ వంటి వాటి విషయంలో తగు సమయాలు ఆచరించాలి.
లో షుగర్ వస్తే ఏం చేయాలనేది స్కూలు లోని టీచర్లకు, లేదా ఇతర యాజమాన్యానికి తెలియజేయాలి. అదే రకంగా, షుగర్ వ్యాధి వున్న పిల్లలను పార్టీలకు మాన్పించకండి. అయితే అధికంగా పార్టీలకు వెళ్ళి ఆహారం తీసుకోడం వంటివి నియంత్రించాలి. ఆతిధ్యమిచ్చే వారికి పిల్లాడి షుగర్ వ్యాధి గురించి చెప్పి డయాబెటిక్ స్వీట్స్ కోరండి. ఆడపిల్లలైతే, గర్భవతులవ్వటానికి షుగర్ వ్యాధి అడ్డంకి కాదు. కాని గర్భస్ధ దశ అంతా రక్తంలోని గ్లూకోజ్ ను నియంత్రిస్తూ, బెబీ ఎదుగుదలను గమనిస్తూ వుండాలి.
షుగర్ వ్యాధి మహిళ తన వ్యాధిని గర్భస్ధ శిశువుకు సంక్రమింపజేస్తుందా? ఒక కుటుంబంలోని సభ్యులకు టైప్ 1 షుగర్ వ్యాధి వుంటే వారి బంధువులలో దాని సంక్రమణ అవకాశాలు ఇలా వుంటాయి…. -తండ్రినుండి బిడ్డకు 7 శాతం -తల్లినుండి బిడ్డకు 2 శాతం -కవల పిల్లైతే…ఒక బిడ్డనుండి మరో బిడ్డకు 35 శాతం -బిడ్డకు స్వతహాగా …3 నుండి 6 శాతం వరకు వుంటుంది.