వైద్య పరిభాషలో కేఫైన్ పాయిజనింగ్ అనే మాట వుంది. ఈ పరిస్ధితి చాలా తీవ్రమైన ఫలితాలనిస్తుంది. ఒక్కొకపుడు మరణం కూడా సంభవంచే అవకాశం వుంది. శరీర బరువు 60 కిలోలు…85 కప్పులు తాగితే చాలు మరణం తధ్యం. కాని అది జరగని పనే. 85 కప్పులు సాధారణంగా ఎవరూ తాగరు. పిచ్చికి దగ్గరలో వుంటే తప్ప. అసలు కేఫైన్ విషమా? కాఫీ మీకు ఉత్సాహాన్ని ఎందుకు ఇస్తుందో తెలుసా? వేడి కాఫీ తాగితే, సోమరితనం మటుమాయం…ఎందుకని? ఎందుకంటే, కాఫీలో వున్న కేఫైన్ ఒక ప్రేరకం. ఎక్స్టాసీ వంటిదే. ఇది నిషేధిత మత్తు పదార్ధం.
కేఫైన్ చట్టబద్ధం చేశారు, ఎందుకంటే నియంత్రించబడిన చిన్నపాటి మొత్తాలలో ఈ పదార్ధాన్ని వాడవచ్చు. కాని అది చేసే హాని అధికమే. ఓవర్ డోస్ మందులు వాడితే వ్యక్తులు ఎలా మరణిస్తారో కేఫైన్ ఓవర్ డోస్ అయినా అంతే. కేఫైన్ పదార్ధాన్ని కాఫీలోనే కాదు మరి కొన్ని ఆహార పదార్ధాలలోను, మందులలోను కూడా కనుగొనవచ్చు. కనుక మీరు అధికంగా కాఫీ తాగేవారైతే, దానికి అదనంగా మీరు వాడే ఇతర పదార్ధాలలో కేఫైన్ కూడా చేరే ప్రమాదముంది. కేఫైన్ పాయిజనింగ్ ని ఎలా కనిపెట్టాలి….? -చేతులు వణుకుతాయి. ఏ వస్తువూ పట్టుకోలేవు. -శ్వాసలో మార్పు వస్తుంది – వాంతులు, వికారం ఏర్పడతాయి. – వేగంగా గుండె కొట్టుకుంటుంది.
– కళ్ళు బైర్లు కమ్మడం, భ్రమలు కలగటం జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే…విషం మీ కేంద్రీయ నరాల వ్యవస్ధను ఎటాక్ చేస్తోంది. శరీర భాగాలలో సంయమనం కొరవడుతుంది. డయేరియా కూడా కలుగవచ్చు. అతి దాహం, మూత్రం అధికంగా వస్తుంది. ఈ పరిస్ధితిలో తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. వాంతి చేయించాలి. పొట్ట పూర్తిగా వాష్ చేయించాలి. కనుక ఆరోగ్యంగాను, సురక్షితంగాను వుండాలంటే మంచి అలవాట్లు చేసుకోండి.