అద్దెకుండాల్సిన అవసరం. పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇల్లు కట్టడం అనేది 30 లక్షలు పెట్టినా,, 10 వేల నుంచి, 15 వేల అద్దె మాత్రమే వస్తుంది…అంటే ధర్మ వడ్డీ కూడా రాదు.. అడ్వాన్స్ కింద కొందరు 15 వేలు తీసుకోవచ్చు, కొందరు 50 వేలు తీసుకుంటారు. డబ్బు బాగా ఉండి ఇల్లు కట్టి అద్దెకు ఇవ్వొచ్చు. నిర్మాణ వస్తువులు తక్కువ ధరలలో ఉండి, డబ్బు ఉంటే ఇల్లు కట్టడమే మంచిది.. అలాగే సొంతింటి కల ఉంటే తప్పక ఇల్లు కట్టుకోవాలి.
ఆర్థిక నిపుణుల సూచన ప్రకారం అయితే అద్దె ఇల్లే బెస్ట్ అని అంటారు..డబ్బు ఖర్చు పెట్టి ఇల్లు కట్టడం అనేది వారి దృష్టిలో వృథా ఖర్చు అవుతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆలోచన ఉంటే, అద్దెకు ఉంటూ,, వచ్చే ఆదాయంలో నమ్మకమున్న కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం, లేదా భూములు కొనడం చేయాలని వారి విలువైన సూచన.
ఇంటికి పెట్టే ఖర్చుతో చూసుకుంటే, మార్కెట్ ప్రకారం, తక్కవ వడ్డీ కూడా రాదు..అద్దెకు ఉంటూ కొన్ని సంవత్సరాల తరువాత ఇల్లు కట్టాలంటే కూడా.. లోన్ విధానంలో డబ్బు తీసుకుని ఇల్లు కట్టుకోవడమే మంచిదని అంటారు..
ఇంటికి అవసమైరంత డబ్బు ఉన్నా ఎంతో కొంత లోన్ తీసుకుని ఇల్లు కట్టాలనేది ఆర్థిక సలహాదారుల అభిప్రాయం.