తమిళులు తిరుపతిని తమిళనాడు లో కలపని అడిగింది నిజమా ? అలా కలపడం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం ఎంటి ? హుండీ ఆదాయం కాకుండా ? అంటే.. దీనికి పూర్తి వ్యతిరేకం నేను విన్నది.. క్రింద రాస్తున్నాను. ఇది నేను చదివినది కాదు, విన్నది చెబుతున్నాను సుమా. నా స్వానుభవం ప్రకారం, కారణాలు ఏమైనా కానీ, స్వతహాగా తెలుగు వారికి భక్తి ఎక్కువ, దేవాలయాలు చుట్టూ తిరగడం అనేది ఎక్కువ.
మద్రాసు (నేటి చెన్నై) బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీ (కంబైన్డ్ ఆంధ్ర ప్రదేశ్ & తమిళనాడు) కి రాజధానిగా వుండేది. అయితే 1953 లో మనం రెండుగా విడిపోతు న్నప్పుడు మద్రాసు తమిళనాడుకి మట్టుకు రాజధానిగా తమిళులు అడిగితే, ఆంధ్రులు ఒప్పుకోలేదు….ససేమిరా అన్నారు. దానికి బదులు వాళ్ళు మధ్యేమార్గంగా, అఇష్టంగా తిరుపతిని మీరు ఉంచుకోండి…తమిళనాడు రాష్ట్రానికి మటుకు మద్రాసు రాజధానిగా ఉంటుంది అని వాళ్ళు కోరడం దానికి మనం అంగీకరించాము అని నేను విన్నది.
అప్పుడు మన రాజధాని కర్నూల్. మనకి పొట్టి శ్రీరాములు గారి దయవల్ల తరువాతి కాలంలో 1956 భాషాప్రయుక్త రాష్ట్రం ఐన ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు రాజధానిగా వచ్చింది.