ఒక స్త్రీ, ఒక పురుషుడి అలవాట్లు, అభిరుచులు, ఇష్టాలు కలిస్తేనే వారు దంపతులుగా జీవితాంతం సుఖంగా జీవిస్తారని అందరూ చెబుతారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ వారిరువురూ కలకాలం ఎంతో అన్యోన్యంగా ఉంటారని అంటారు. అయితే కేవలం అలవాట్లు, అభిరుచులే కాదు జ్యోతిషశాస్త్రం ప్రకారం దంపతుల రాశులు మ్యాచ్ అయినా కూడా వారు జీవితాంతం సుఖంగా కలిసిపోయి ఉంటారట. ఈ క్రమంలో దంపతులకు ఏయే రాశులు ఉంటే మంచిదో, ఏయే రాశులు ఉన్న వారికి మ్యాచింగ్ కరెక్ట్‌గా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. తుల – సింహ రాశులు… ఈ రాశులను కలిగి ఉన్న దంపతులు సామాజికంగా ఎక్కువ ఉత్తేజంగా ఉంటారట. వీరు ఎక్కడ ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారట. ఎల్లప్పుడూ ఓపెన్‌గా ఉంటారట. దంపతుల్లో ఒకరికి సింహ రాశి ఉంటే వారు డిమాండింగ్‌గానూ, తుల రాశి ఉన్న వారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే వారు గానూ ఉంటారట.
మేషం – కుంభ రాశులు… వీరు ఎల్లప్పుడూ సాహస కార్యాలంటే ఇష్ట పడతారట. కొత్త వాటిని కనిపెట్టడంలో సృజనశీలురై ఉంటారట. దంపతులిరువు ఒకరికి ఒకరు స్వేచ్ఛను, ప్రేమను ఇచ్చి పుచ్చుకుంటారట. మేషం – కర్కాటక రాశులు… వీరు ఎల్లప్పుడూ ధైర్యవంతులుగా ఉంటారట. ఏ పని చేసేందుకైనా వెనుకాడరట. జీవితంలో ముందుకు వెళ్లే కొద్దీ మరింత శక్తిశీలురవుతారట. మేషం – మీన రాశులు… వీరు మంచి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటారట. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అన్న భేద భావాలు వారిలో రావట. ఒకరితో ఒకరు సులభంగా సర్దుకుని పోతారట. వారి సంబంధం జీవితాంతం కొనసాగుతుందట. వృషభం – కర్కాటక రాశులు… ఈ రాశులు ఉన్న దంపతులు ఒకరినొకరు గౌరవించుకుంటారట. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకుంటారట. వీరిద్దరూ జీవితాంతం అన్యోన్య దాంపత్యం కొనసాగిస్తారట.
మకరం – వృషభ రాశులు… ఈ రాశులు ఉన్న దంపతులు ఒకరినొకరు సులభంగా అర్థం చేసుకుంటారట. ఒకరినొకరు ఎల్లప్పుడూ గౌరవించుకుంటూ, పొగుడుకుంటూ ఉంటారట. వీరిది కూడా అన్యోన్య దాంపత్యమేనట. ధనుస్సు – మేష రాశులు… ధనుస్సు, మేష రాశులను కలిగి ఉన్న దంపతులు అత్యంత అన్యోన్యంగా ఉంటారట. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ, ఆప్యాయత ఉంటుందట. కర్కాటకం – మీన రాశులు… ఈ రాశులు ఉన్న దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిస్తారట. ఎవరినీ నొప్పించని రీతిలో వ్యవహరిస్తూ ముందుకు సాగుతారట. సింహం – ధనుస్సు రాశులు… ఈ రాశులు ఉన్న జీవిత భాగస్వాములు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసే ధోరణిని కలిగి ఉంటారట. ఒకరిపై ఒకరికి బాగా నమ్మకం ఉంటుందట. వారు తమకు తామే సమస్యలను పరిష్కరించుకుంటారట.
కన్య – మకర రాశులు… ఈ రాశులు ఉన్న దంపతులకు ఒకరంటే ఒకరికి ఆకర్షణ కలుగుతుందట. అదే వారిని జీవితంలో ముందుకు తీసుకెళ్తుందట. ఎల్లప్పుడూ ఓపెన్‌గానే మాట్లాడుకుంటారట. సింహం – మిథున రాశులు… సింహం, మిథున రాశులను కలిగి ఉన్న దంపతులు సాహస కృత్యాలంటే ఇష్టపడతారట. వీరు తమ తమ జీవిత భాగస్వాములను అత్యంత ఎక్కువగా ప్రేమిస్తూ ముందుకు సాగుతారట. కుంభం – మిథున రాశులు… ఈ రాశులను కలిగి ఉన్న దంపతులు తమ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా నిబ్బరంగా ఉంటారట. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారట. ఒకరికి మరొకరు సహాయం చేసుకుంటూ జీవనం సాగిస్తారట.
వృశ్చికం – సింహ రాశులు… ఈ రాశులు ఉన్న దంపతులు తమ వ్యక్తిత్వాలు, స్వభావాలతో మంచి సంబంధాలను కలిగి ఉంటారట. వృశ్చికం రాశి వారిని సింహ రాశి వారు అన్ని విషయాల్లోనూ సంతృప్తి పరుస్తారట. మిథునం – తుల రాశులు… దంపతులిద్దరిలో ఒకరికి మిథునం, మరొకరికి తుల రాశి ఉంటే వారు లైంగిక పరంగా మంచి సంబంధాలను కలిగి ఉంటారట. వారిరువురు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారట.