లవ్ ఫెయిల్యూర్ కాగానే చాలామంది ఇక తమ లైఫ్ అంతా చీకటిమయం అని అనుకుంటుంటారు. ఇంకా కొందరైతే సైకోలుగా మారి ప్రేమను నిరాకరించిన వారిని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తుంటారు. ఈ లవ్ ఫెయిల్యూర్ ను త్వరగా కోలుకోలేక తమకు తాముగా బాధను అనుభవిస్తూనే, ఫ్యామిలీని కూడా తమ ప్రవర్తనతో ఇబ్బందికి గురిచేస్తుంటారు. మందు, సిగరెట్, డ్రగ్స్ లాంటి కొత్త అలవాట్లకు చేరువవుతారు…. కానీ కొన్ని నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తే….మన లైఫ్ ను కలర్ ఫుల్ గా మార్చుకోవొచ్చు. ఎటువంటి చెడు మార్గాలను ఆశ్రయించకుండా…..సమాజంలో మనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకోవొచ్చు.
లవ్ ఫెయిల్యూర్ అయిన వారు చేయాల్సినవి: కొన్ని రోజులు ఫోన్ కు దూరంగా ఉండండి. ఫిక్షన్ కథలు చదవడం స్టార్ట్ చేయండి. వంట నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. తెలయని కొత్త భాషను నేర్చుకునే ప్రయత్నం చేయండి. జిమ్ కు వెళ్లడం అలవాటు చేసుకోండి. ఫ్యామిలీ వాళ్లతో టైమ్ స్పెండ్ చేయండి. వీలుంటే భాష తెలియని ప్రదేశాలకు వెళ్లి, వారితో స్పెండ్ చేయండి. మీ లక్ష్యం గురించి ప్రతిరోజూ రివ్యూ చేసుకోండి.
లవ్ ఫెయిల్యూర్ అయిన వారు చేయకూడనివి.. వెంటనే వేరే వాళ్లతో లవ్ ను స్టార్ట్ చేయకండి. మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్-భాయ్ ప్రెండ్ కు సంబంధించిన ఆలోచనలు రానివ్వకండి. వారికి సంబంధించిన గిప్ట్స్ ఉంటే మీ కంటికి కనిపించని ప్రదేశాల్లో పెట్టేయండి. ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయకండి…ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు బీజీగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఇలా ఓ నెల రోజుల పాటు చేస్తే, మన మనకు క్రమంగా మన దారిలోకి వస్తుంది. మన జీవితంలోకి ఎందరో వస్తుంటారు, పోతుంటారు, కానీ మన వ్యక్తిత్వాన్ని మాత్రం ఎవ్వరికోసం వదులుకోవొద్దు. జీవితం చాలా విలువైనది. ఆలోచిస్తే…ఇంకెంతో ఉంది, అంతేకానీ ప్రేమ పేరుతో చంపడం, చావడం లాంటివి అర్థరహిత చర్యలు.