Shivering : డిసెంబర్ నెల చివరకు చేరుకున్నాం. దీంతో చలి మరింత ఎక్కువైంది. ఈ క్రమంలోనే చలి నుంచి తట్టుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఉన్ని దుస్తులను ఈ కాలంలో ఎక్కువగా ధరిస్తారు. అయితే కింద తెలిపిన ఆహారాలను కూడా రోజూ తీసుకోవడం వల్ల శరీరాన్ని ఈ కాలంలో వెచ్చగా ఉంచుకోవచ్చు. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. మరి శరీరం వెచ్చగా ఉండాలంటే.. తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. పసుపును మనం రోజూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి పసుపును వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల కాలిన గాయలు, దెబ్బలు, పుండ్లను త్వరగా మానేలా చేస్తుంది. పసుపు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు తగ్గేలా చేస్తుంది. రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపును కలుపుకుని తాగితే శరీరం వెచ్చగా కూడా ఉంటుంది.
2. జీర్ణవ్యవస్థ పనితీరుకు బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. శ్వాస వ్యవస్థను ఇది శుభ్రం చేస్తుంది. మలబద్దకం, అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. రోజూ రాత్రి భోజనం అనంతరం చిన్న బెల్లం ముక్కను తింటుండాలి. దీంతో శరీరం వెచ్చగా ఉంటుంది. చలి నుంచి రక్షణ లభిస్తుంది.
3. కుంకుమ పువ్వులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని పలు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇది జలుబును తగ్గించేందుకు పనిచేస్తుంది. రోజూ రాత్రి పాలలో ఒక కుంకుమ పువ్వు రెక్కను వేసి తాగితే శరీరం వెచ్చగా ఉంటుంది. అంతేకాదు, శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.
4. పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచే అశ్వగంధకు శరీరాన్ని వేడిగా ఉంచే శక్తి కూడా ఉంది. అందువల్ల దీన్ని రోజూ తీసుకోవాలి. రాత్రి ఒక గ్లాస్ పాలలో అర టీస్పూన్ అశ్వగంధ పొడిని కలిపి తాగితే శరీరం వేడిగా ఉంటుంది.
5. నెయ్యిలో అనేక ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయి. నెయ్యిని రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. నెయ్యిని తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అధిక బరువు తగ్గవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం వెచ్చగా ఉంటుంది. రోజూ రాత్రి భోజనంలో ఒక టీస్పూన్ నెయ్యిని వేసుకుని తింటే శరీరాన్ని వేడిగా ఉంచుకోవచ్చు.