సోషల్ మీడియా లో చకకర్లు కొడుతున్న ఒక చెత్త వార్త, ప్రముఖ గాయనీ గాయకులు, ఎన్నో ఏళ్ల నుండి ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేకుండా నడుస్తున్న కార్యక్రమం, ఆస్కార్ సాదించిన పాటల రచయిత, సంగీత దర్శకుడు, అందరి పరువు తీసేసిన ఒక పిల్ల కాకి. ఈ మాట అనడానికి నేను ఏమాత్రం సందేహించను. ఎందుకంటే ఇలాంటి పిల్ల కాకులు ప్రతీదీ రోడ్డుకి ఈడిస్తే గొప్ప అనుకుంటారు. ముఖ్యంగా వీరిని జెన్ జీ అనే పేరుతో పిలుస్తున్నారు, అయితే మా ఇంట్లో కూడా 1997 తరువాత పుట్టిన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మేనత్త పిల్లలు లేదా ఇతరత్రా చాలామంది ఉన్నారు. అయితే చేతికి దొరికినదాంతో తల్లితండ్రులే కాదు స్పాట్ లో ఎవరు ఉంటే వారు బడిత పూజ చేసే భాద్యత తీసుకోవడమే ఈ రోజు ఈ వంకర పోకడలు లేవు అనిపిస్తుంది. ఎందుకంటే నా ఉద్దేశ్యం జెన్ జీ ని తప్పు పట్టాలి అని కాదు కానీ ఎక్కువశాతం వారిలో ఇలానే ఉన్నారు.
చాలా సంస్థలో వాళ్ళని తీసుకోడానికి సిద్దంగా లేరు అందుకు కారణం ఇలా చిన్న విషయాన్ని పెద్దది చేయడం, అబ్స్కాండ్ అవ్వడం, స్టాండ్ తీసుకోలేకపోవడం, ఎస్కేపిజం, ఎక్కువ మాట్లాడి తక్కువ పని చేయడం, చేయాల్సిన పని సరిగా చేయకపోవడం, ఎంత చెపినా పద్దతులు మార్చుకోలేకపోవడం, చివరాకరికి బురద జల్లి పరువు తీసేయడం. సోషల్ మీడియా ఒకటి వచ్చాక ఎవ్వడు ఏదైనా మాట్లాడుకోవచ్చు కనుక ఒక ప్రఖ్యాత ప్రోగ్రామ్ మీద బురద జల్లితే తన తప్పు కప్పేవచ్చు అనుకుంది ఈ పిల్ల గాయని. నేను వివరాలలోకి వెళ్ళాలి అని కూడా అనుకోడం లేదు, ఎందుకంటే సమాజం లో ప్రతి సమస్య కి నిలబడి ప్రయత్నించి నిర్ణయం తీసుకోవాలి, నా మీద అక్కసుతో చేశారు అనే అధికారం లేదు, చేస్తే చేస్తారు, ఇక్కడ కాకపోతే ఇంకోచోట ప్రయత్నం చేసుకోడమే. కక్ష సాధించి పక్కన పెట్టాల్సిన అవసరం అటువంటి పెద్దవాళ్ళకి లేదు అని నా అభిప్రాయం.
లేదా ఇతర మీడియా వారు ఈ టీవి ని తక్కువ చేయడానికి చేసిన ప్రోగ్రామ్ కూడా అనుకోవచ్చు. ఎన్ని ఏళ్లుగా నిరంతరాయంగా సాగుతున్న ప్రోగ్రామ్, అందులో ఎవరు ఎలా ఉండాలి ఎలా కనిపించాలి అన్నది డైరక్టర్ చూసుకుంటాడు, పాటల పోటీ అక్కడి నిర్ణేతలు చూసుకుంటారు. మనం చేయాల్సింది మన బెస్ట్ ఇవ్వడం లేకపోతే ప్రయత్నం చేయడం. అంతే తప్ప నన్ను తొక్కేసారో లేదంటే మొక్కయి అందరికీ మోక్షం ఇస్తా అనే డబ్బా కబుర్లు మానేస్తే మంచిది. వినోద్ కాంబ్లే ఇలానే అప్పట్లో సచిన్ మీద తెగ పెలేవాడు, ఇవాళ ఒంట్లో అన్ని జబ్బులతో ఇంట్లో కూర్చున్నాడు. నిజంగా ఒకడు తొక్కినా నువ్ కొత్త ఆప్షన్ చూడాలి తప్ప తొక్కేసాడు అని ఇంకో వంద మందితో తొక్కించుకోకూడదు. 2025 లో ఒకడ్ని తొక్కే అవకాశం లేదు, అన్ని ఎదిగే అవకాశాలే. ఎలాగూ బొంగురు గొంతే కదా, పరువు కాపడుకోబోయి గోల చేసింది. సోషల్ మీడియా లో ఉండే యోధులు రెచ్చిపోయారు. పచ్చళ్లు అమ్ముకునేవాళ్ళనే పచ్చడి చేశారు, కీరవాణి లాంటి వారిని దొరికితే వూరుకుంటారా ?
గత నెలలలో ఇలాంటి జెన్ జి ఆఫీసు లో ఒక డేటా బ్రీచ్ లో తప్పు చేస్తే ఒకేసారి 8 మందిని బయటకి వెళ్ళగొట్టాల్సి వచ్చింది, అందులో ఇద్దరు అమ్మాయిలు. సార్ మమ్మల్ని ఇలా సడెన్ గా తీసేస్తే లింక్డ్ఇన్ లో కంపెనీ ని మిమ్మలని టాగ్ చేసి మాకు నచ్చినట్లు పోస్ట్ చేస్తాం, ఏదైనా చేయగలం అని వార్నింగ్ ఇచ్చారు, తలచుకుంటే స్కాండల్ లో ఇరికిస్తాం అని, సిసిటీవి తో పాటు మధ్యవేలు చూపించి బయటకు పొమ్మన్నారు. ఈ రోజు ఈ పిల్ల గాయని చేసిన పని అలానే అనిపించింది. ఒక విమెన్ కార్డ్ లేదంటే టాలెంట్ కార్డ్ ని సులభంగా వదిలేస్తారు కానీ ఇలాంటి మూర్ఖపు జనరేషన్ తో వేగడం కష్టం. కనుక అందరూ కాదు కానీ 1997 తరువాత పుట్టిన కొందరు పిల్లకుంకలతో జాగ్రత్త తప్పదు.