హిందూ వివాహ పద్దతిలో జరిపే ప్రతి ఆచారం వెనుక ఉన్న కారణాలు, శాస్త్రీయమైన దృక్పధాలు దాగిఉన్నాయి. పెళ్లిలో వధూవరులకు నుదుటన బాసికం కడతారు. అది ఎందుకో, దాని వెనుకు ఉన్న అసలు కారణం ఏమిటో తెలుసుకుందాం. మనిషి శరీరం లో 72 వేల నాడులున్నాయి. వాటిలో 14 నాడులు చాలా ప్రముఖమైనవి.ఈ నాడులలో ఇడా, పింగళ, సుహఙ్గమా అనే మూడు మరీ ముఖ్యమైనవి. వీటిలో సుహఙ్గమా అనే నాడీకీ కుడి వైపు, సూర్య నాడీ, ఎడమ వైపు చంద్ర నాడీ ఉంటాయి.
ఈ రెండు కలిసేది ముఖంలోని నుదుటి మధ్య భాగం. ఈ రెండు నాడుల కలయిక అర్ధచంద్రాకారం లో ఉంటుంది. దీనిని దివ్య చక్షవు అనే ఋషులు ఆంటూఉంటాము. ఈ దివ్య చక్షవు పై ఇతరుల దృష్టి పడి దోషం కలగకుండా ఉండేందుకు వధూవరులకు నుదుటిన బాసికం కడతారు. బాసికం అర్ధ చంద్రాకారంలో కానీ, త్రీభుజాకారంలో కానీ ఉంటుంది.
వివాహ క్రతువు ముగిసిన తర్వాత నవదంపతులను ఆశీర్వదిస్తూ పండితులు చెప్పే శ్లోకం అర్థం ఏమిటంటే.. మిలమిల మెరిసే బంగారంలాగా ప్రకాశిస్తున్నా ఈ దంపతులు …కొడుకులు, కూతుర్లతో వంశాభివృద్ధి చెందాలి. ఎప్పుడు మంచిపనులు చేస్తూ, సిరి సంపదలను అనుభవిస్తూ దీర్ఘాయులై చిరకాలం జీవించాలి.. అని దీవిస్తారు.